ఇక తెలంగాణపై చంద్రబాబు ఉడుంపట్టు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంపై ఉడుంపట్టు పట్టాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో జరిగిన తెలంగాణ శాసనసభ్యులు, ఇంచార్జీల సమావేశంలో ఆయన ఎక్కువ సేపు తెలంగాణపైనే ప్రసంగించారు.
సీమాంధ్ర కన్నా తెలంగాణపై ఎక్కువ దృష్టి సారిస్తానని చెప్పారు. వారంలో ఒక రోజు తెలంగాణ కోసం కేటాయిస్తానని అన్నారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు వదిలేది లేదని ఆయన అన్నారు. హైదరాబాదు నుంచే ఆంధ్రప్రదేశ్ పాలన సాగిస్తానని చెప్పారు.
తెలంగాణలోని పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. టిడిపి తెలంగాణ నాయకులకు కూడా ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు. తెలంగాణను తానే అభివృద్ధి చేశానని, తన ప్రభుత్వ హయాంలోనే చేసిన అభివృద్ధి కారణంగానే రాష్ట్ర బడ్జెట్ ప్రస్తుతం మిగులులో ఉందని చంద్రబాబు చెప్పుకున్నారు.

బాబుకు టీ నేతల సన్మానం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని పార్టీ నేతలు తెలంగాణ నేతలు సన్మానించారు.

చంద్రబాబుకు పూలమాల
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో విజయం సాధించడం ద్వారా తెలంగాణ నేతలకు కూడా భరోసా ఇచ్చినట్లు కనిపిస్తున్నారు.

తెలంగాణలో అధికారంలోకి తెస్తా...
తమ పార్టీ తెలంగాణలో కూడా అధికారంలోకి తెస్తానని, అప్పటి వరకు వదిలిపెట్టబోనని, హైదరాబాదు నుంచే ఆంధ్రప్రదేశ్ పాలన సాగిస్తానని చెంద్రబాబు చెప్పారు.

హైదరాబాద్ అభివృద్ధి నాదే..
హైదరాబాదును అభివృద్ధి చేసింది తానే అని, కాంగ్రెసు పార్టీ హైదరాబాద్ ఇమేజ్‌ను నాశనం చేసిందని చంద్రబాబు నాయుడు అన్నారు.

సంపద సృష్టించాం..
తెలంగాణలో అభివృద్ధి సాధించి, సంపద సృష్టించామని, ఆదాయం పెంచామని, దాని వల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మిగులులో ఉందని చంద్రబాబు చెప్పారు.

తెలంగాణకు సమయం
తెలంగాణకు తాను సమయం కేటాయిస్తానని, వారంలో ఓ రోజు ప్రత్యేకంగా తెలంగాణ కోసమే కేటాయిస్తానని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications