రేవంత్ ఇష్యూ: 'అబద్దం, చంద్రబాబు అలా చెప్పలేదు'
హైదరాబాద్: ఇటీవలి పరిణామాలతో తనకు రెండు రోజులుగా నిద్ర పట్టలేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నట్లుగా వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు.
ఆయన విజయవాడలో అధికారులతో మాట్లాడుతూ.. చంద్రబాబు తనకు నిద్రపట్టడం లేదని వ్యాఖ్యానించినట్లు పత్రికల్లో వచ్చిందన్నారు. అయితే, అందులో నిజం లేదని చెప్పారు. ఆయన అక్కడ అటువంటి వ్యాఖ్యలు ఏమీ చేయలేదని చెప్పారు.
కాగా, తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఉదంతంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోందని వార్తలు వచ్చాయి.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు, అడిషనల్ డీజీపీ గౌతం సవాంగ్, పలు శాఖల ఉన్నతాధికారులతోపాటు, మంత్రులు దేవినేని ఉమా మహేశ్వర రావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్‌లతో ఆయన సమావేశమాయ్యారు. ఈ సమయంలో చంద్రబాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు బుధవారం మీడియాలో వార్తలు వచ్చాయి.

విశ్వసనీయ సమాచారం మేరకు అంటూ కొన్ని పత్రికలు చంద్రబాబు చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలపై వార్తా కథనాలను ప్రచురించాయి. తాజా ఘటనలతో రెండు రోజులుగా నిద్రపట్టడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు ఆ కథనాలు తెలియజేస్తున్నాయి. మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నానని చెప్పారు.
నాయినీ నిజాయితీ ఉంటే కేసీఆర్‌ను అరెస్ట్ చేయి: చంద్రబాబు
ఓటుకు నోటు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. చంద్రబాబే సూత్రధారి అంటూ తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఘాటుడుగా స్పందించారు.
తెలంగాణలో కేసీఆర్ ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను కొన్నారని, నిజాయితీ ఉంటే కేసీఆర్ పైనే కేసు పెట్టాలని, తనను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, తాను ఎవరికీ భయపడేది లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications