వీడిన సస్పెన్స్: రెండో గేట్ నుంచి అసెంబ్లీలోకి బాబు
హైదరాబాద్: శాసనసభలోకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ ద్వారం గుండా ప్రవేశిస్తారనే విషయంపై సస్పెన్స్ వీడింది. ఆంధ్రప్రదేశ్ డిజిపి జెవి రాముడు,
హైదరాబాదు పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల సందర్భంగా కల్పించాల్సిన భద్రతపై చర్చలు జరిపారు.
చంద్రబాబు రెండో గేట్ నుంచి శానససభలోకి ప్రవేశిస్తారు. మొదటి గేట్‌కు తెలంగాణ అసెంబ్లీ బోర్డు ఉంది. దీంతో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ శాసనసభలోకి అడుగు పెట్టడానికి రెండో
గేట్‌ను వాడుతారు. కాగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లలో కొంత గందరగోళం ఉన్న మాట వాస్తవమేనని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారంనాడు అసెంబ్లీ కమిటీ హాల్లో పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా భద్రతా
ఏర్పాట్లపై ఆయన చర్చించారు. ఈ నెల 19వ తేదీ ఉదయం 11.52 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయని యనమల చెప్పారు.
మొదటి రోజు శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందని, ఇటీవల మరణించిన శాసనసభ్యులకు సంతాపం తెలుపుతామని చెప్పారు. ఈ నెల 20వ తేదీన స్పీకర్ ఎన్నిక
జరుగుతుందని, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండకపోవచ్చునని మంత్రి అన్నారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 8.55 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంటుందని ఆయన చెప్పారు. 23, 24
తేదీల్లో ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుందని అన్నారు.












Click it and Unblock the Notifications