జగన్ బాటలోనే చంద్రబాబు - అక్కడే అసలు ట్విస్ట్ : ముంచేనా- తేల్చేనా..!!

రానున్న ఎన్నికల్లో కీలకమైన నినాదం..విధానపరమైన అంశం పైన టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో చేస్తున్న సంక్షేమం కంటే మెరుగైన సంక్షేమం అమలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేస్తామని చెప్పుకొచ్చారు. అటు సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేననే ధీమాతో ఉన్నారు. ఈ ధీమా వెనుక తాను అమలు చేస్తున్న సంక్షేమం.. సోషల్ ఇంజనీరింగ్ పైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు.

జగన్ చేసిన సంక్షేమానిక మించి అంటూ

జగన్ చేసిన సంక్షేమానిక మించి అంటూ


ఇప్పుడు చంద్రబాబు చేసిన ప్రకటన..ఇస్తున్న హమీ పైన ప్రధానంగా వైసీపీలో చర్చ మొదలైంది. చంద్రబాబు తాను జగన్ కంటే మెరుగైన సంక్షేమం అమలు చేస్తామని చెప్పటం పైన విశ్లేషణలు చేస్తున్నారు. ఇదే సమయంలో కీలక అంశాలను ప్రస్తావిస్తున్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత..ప్రతిపక్ష నేతగా జగన్ చంద్రబాబు నాడు ఇచ్చిన హమీలను అమలు చేయని విషయం పైనే ఎక్కువగా ప్రచారం చేసారు. చంద్రబాబు విశ్వసనీయత పైన దెబ్బ కొట్టే ప్రయత్నం చేసారు. పాదయాత్ర సమయంలోనూ తనకు ఉన్నదీ.. చంద్రబాబుకు లేనిదీ విశ్వసనీయతే అంటూ..ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ అధికారంలోకి వచ్చారు.

చంద్రబాబు విశ్వసనీయపై టార్గెట్

చంద్రబాబు విశ్వసనీయపై టార్గెట్


ఇక, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ప్రతీ సభలో..సమావేశంలో తన నవరత్నాల హామీలు.. అమలు.. నిధుల ఖర్చు గురించి వివరిస్తూనే..చంద్రబాబు గతంలో హామీలిచ్చి మోసం చేసారని..తాను మాత్రం అమలు చేసానని పదే పదే చెబుతూ ప్రజల్లో సానుకూలత పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమం కారణంగా ఆర్దికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందనే వాదన ఉంది. ఈ సమయంలో చంద్రబాబు సైతం అంతకు మించి సంక్షేమం అందిస్తామని చెప్పటం ద్వారా.. సీఎం జగన్ ట్రాప్ లో చంద్రబాబు చిక్కుకున్నారనే అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది. అదే సమయంలో జగన్ చేసిన దాని కంటే ఎక్కువగా చేస్తానని చెప్పకపోతే ఓట్ బ్యాంక్ పైన ప్రభావం పడే అవకాశం ఉంది.

ఎన్నికల్లో ఇద్దరు నేతలకు ఇదే ప్రధానాస్త్రం

ఎన్నికల్లో ఇద్దరు నేతలకు ఇదే ప్రధానాస్త్రం


ఇప్పుడు చంద్రబాబు చేసిన జగన్ కు మించిన సంక్షేమం అంటే..నవరత్నాలు కొనసాగిస్తారా లేక వీటిని రద్దు చేసి..కొత్త పథకాలు తెస్తారా అని ప్రశ్నించేందుకు వైసీపీ సిద్దం అవుతోంది. ఇక, చంద్రబాబు పథకాలు అమలు గతంలో చేయలేదని..ఇప్పుడు అధికారం ఇస్తే చేసే అవకాశమే లేదని గతంలోనే చేసిన ప్రచారమే మరోసారి వైసీపీ తెర మీదకు తెస్తోంది. చంద్రబాబుకు ఓటు వేయటం ద్వారా సంక్షేమానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లేనని పార్టీ ప్లీనరీ వేదికగానే సీఎం జగన్ స్పష్టం చేసారు. దీంతో..చంద్రబాబు సంక్షేమం కొనసాగింపు.. కొత్త పథకాల పైన స్పష్టత కోరుతామని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు ఈ హామీలు రెండు పార్టీల్లో ఎవరికి మేలు చేస్తాయి.. ఎన్నికల వేళ ఎవరికి నష్టం చేస్తాయనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+