చంద్రబాబు సంచలన నిర్ణయం
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో పాటు మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి మంత్రివర్గాన్ని సామాజిక సమతూకంతో చంద్రబాబు సరిగ్గా తూశారు.
బీసీలకు అత్యధిక ప్రాధాన్యత
ఎక్కువగా కొత్తవారికి అవకాశాలు దక్కాయి. ప్రాంతీయ, సామాజిక సమతూకంతో కేబినెట్ ను ఏర్పాటు చేశారు. బీసీ సామాజిక వర్గానికి ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యతను ఇస్తానని చంద్రబాబు గతంలోనే హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నారు. మంత్రివర్గ ఏర్పాటులో బీసీ సామాజికవర్గానికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు. జగన్ ప్రబుత్వంలో బీసీలకు ఏడు మంత్రి పదవులు ఇచ్చారు. తామే బీసీలకు అత్యధిక ప్రాధాన్యతను కల్పించామంటూ గొప్పగా ప్రకటించుకున్నారు. కేవలం ఏడు మంత్రి పదవులకే సామాజిక న్యాయం చేశామంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు.

వైసీపీ ఏమంటుందో?
తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు, బలహీన వర్గాల పార్టీ అని పార్టీ ఏర్పాటు నుంచి ట్యాగ్ ఉంది. టీడీపీ అధికారంలోకి రాగానే కేబినెట్ లో గతంలోకన్నా ఎక్కువగా బీసీలకు ప్రాధాన్యత ఉంటుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అందరూ చంద్రబాబు కూడా ఏడు మంత్రి పదవులను బీసీలకు కేటాయిస్తారనుకున్నారు. అయితే ఎనిమిదిని కట్టబెట్టి బీసీలకు ప్రాధాన్యతనివ్వడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని నిరూపించారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందో చూడాలి. గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద బుధవారం ఏపీ కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి నరేంద్రమోడీ, అమిత్‌షా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై, రజనీకాంత్, చిరంజీవి లాంటి అతిరథ మహారథులంతా హాజరయ్యారు.












Click it and Unblock the Notifications