రూ.200 కోట్ల రాజభవనంలో, వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ ఏడడుగులు?

పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి వార్తలకు ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా అప్‌డేట్స్ ఎంత వేగంగా వైరల్ అవుతాయో, ఆయన వ్యక్తిగత జీవితం పై వచ్చే పుకార్లు కూడా అంతే రేంజ్‌లో హల్‌చల్ చేస్తుంటాయి. తాజాగా ఫిలిం నగర్ వర్గాల్లో ప్రభాస్ పెళ్లి, ఆయన నిర్మిస్తున్న కొత్త ఇంటికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది.

కోకాపేటలో 200 కోట్ల రాజభవనం!

హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (కోకాపేట) పరిసరాల్లో ప్రభాస్ సుమారు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఒక విలాసవంతమైన భవనాన్ని నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో, అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాలతో ఈ డ్రీమ్ హౌస్ నిర్మాణం జరుగుతోందట. ఈ భారీ రాజభవనానికి సంబంధించి నెట్టింట రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. కాబోయే భార్యకే సర్ ప్రైజ్ గిఫ్ట్ గా దీన్ని ఇద్దామని అనుకుంటున్నారంటున్నారు. వచ్చే ఏడాది ప్రభాస్ ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను వివాహం చేసుకోబోతున్నారని, ఈ పెళ్లి పనులను ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది.

ప్రభాస్ 'ఫౌజీ’ సెట్స్‌లో తీవ్ర విషాదం.. ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో సీనియర్ యాక్టర్!
ప్రభాస్ 'ఫౌజీ’ సెట్స్‌లో తీవ్ర విషాదం.. ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో సీనియర్ యాక్టర్!
Prabhas to Tie the Knot with a Businessman Daughter at a 200 Crore Royal Mansion

పెళ్లి సమయానికి పూర్తి

పెళ్లి సమయానికి ఈ డ్రీమ్ హౌస్ నిర్మాణం పూర్తికానుందని, పెళ్లయ్యాక భార్యతో కలిసి ఆ భవనంలోకి గృహప్రవేశం చేసేలా ప్లాన్ చేస్తున్నారని.. అందుకే కాబోయే భార్యకు కానుకగా ప్రభాస్ ఈ ఇల్లు నిర్మిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కోకాపేట పరిసరాల్లో ప్రభాస్ ఒక లగ్జరీ ఇల్లు నిర్మిస్తున్న మాట నిజమే అయినప్పటికీ.. దానిని పెళ్లితో ముడిపెడుతూ వస్తున్న వార్తల్లో ఎలాంటి అధికారిక నిజం లేదంటున్నారు. ప్రభాస్ టీమ్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఈ వార్తలను ధ్రువీకరించలేదు.

ఆ మూవీ సమయంలో నా అండాలు దాచుకున్నా: 'ప్రభాస్' హీరోయిన్ కామెంట్స్ వైరల్
ఆ మూవీ సమయంలో నా అండాలు దాచుకున్నా: 'ప్రభాస్' హీరోయిన్ కామెంట్స్ వైరల్

గతంలో అనుష్క శెట్టి, కృతి సనన్ వంటి కథానాయికలతో ప్రభాస్ పెళ్లి అంటూ వచ్చిన పుకార్ల తరహాలోనే.. ఇప్పుడు కూడా కొత్త ఇంటి పేరు చెప్పి ఈ ప్రచారానికి తెరలేపారు. ప్రస్తుతం 46 ఏళ్ల ప్రభాస్ తన పూర్తి దృష్టిని సినిమాలపైనే నిలిపారు. ఆయన డైరీ రాబోయే మూడేళ్ల వరకు భారీ ప్రాజెక్టులతో నిండిపోయింది. ఈ స్థాయి బిజీ షెడ్యూల్ మధ్య వచ్చే ఏడాదే ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కుతారనే వార్తల్లో నిజం ఉందా? లేదా? అనేది డార్లింగ్ కే తెలియాలంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+