ఇండియా టుడే యాంకర్ కు చంద్రబాబు ప్రశంస-చంద్రబోస్ తో తెలుగు సంభాషణపై..
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు-నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఎంపికైంది. దీంతో చిత్ర బృందానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందాయి. ఇదే క్రమంలో పలు జాతీయ ఛానళ్లలో సైతం ఈ సాంగ్ రాసిన టాలీవుడ్ పాటల రచయిత చంద్రబోస్ ను అంతా ప్రశంసించారు. అలాగే ఇండియా టుడే జాతీయ న్యూస్ ఛానల్ లోనూ యాంకర్ అక్షితా నందగోపాల్ చంద్రబోస్ ను ప్రశంసిస్తూ, అనూహ్యంగా ఆయనతో తెలుగులో మాట్లాడారు. ఆయన్ను కూడా తెలుగులోనే మాట్లాడమని ప్రోత్సహించారు. దీంతో చంద్రబోస్ ఆనందంగా తెలుగులోనే తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఇలా ఓ జాతీయ న్యూస్ ఛానల్లో, అందునా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో నిత్యం ఇంగ్లీష్ లోనే వార్తలు చదివే యాంకర్ అక్షితా నందగోపాల్.. తెలుగులో మాట్లాడుతుండే సరికి ఆ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు సైతం కాసేపు గందరగోళానికి గురయ్యారు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే అభినందించారు. ఇదే అంశంపై తాజాగా ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు సైతం సదరు యాంకర్ అక్షితను అభినందిస్తూ ట్వీట్ పెట్టారు.

ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ఇండియాటుడే డిప్యూటీ ఎడిటర్, న్యూస్ యాంకర్ అక్షితను అభినందిస్తూ చంద్రబాబు నాయుడు ఇవాళ ట్వీట్ పెట్టారు. ఇందులో RRR సినిమాలో పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పై గీత రచయిత చంద్రబోస్ తో తెలుగులో ఇంటర్వ్యూ చేసిన అక్షితను ఆయన అభినందించారు. చంద్రబోస్ గారి పాట....దానిపై ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ లో తెలుగులో అక్షిత మాట...అద్భుతం, అభినందనీయం అంటూ టిడిపి అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
చంద్రబోస్ గారి పాట...దానిపై ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో తెలుగులో అక్షిత మాట...అద్భుతం, అభినందనీయం. @Akshita_N, @boselyricist, @IndiaToday #RRR https://t.co/eUAAvdeghQ
— N Chandrababu Naidu (@ncbn) January 14, 2023
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications