అమరావతిలో వాజ్ పేయ్ విగ్రహావిష్కరణ..! గతం గుర్తుచేసుకున్న సీఎం..!

రాజధాని అమరావతిలో ఉన్న వెంకటపాలెం వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఇవాల కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి ఆవిష్కరించారు.అనంతరం అటల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, మొక్కను నాటారు. సభా ప్రాంగణంలో వాజ్‌పేయి జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను వారు తిలకించారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన సుపరిపాలనా దివస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.

ప్రజా రాజధాని అమరావతిలో అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించుకోవటం సంతోషంగా ఉందని చంద్రబాబు తెలిపారు. ప్రపంచం అంతా గుర్తించేలా అమరావతిని తీర్చిదిద్దటమే తమ ధ్యేయం అన్నారు. స్పూర్తిదాత వాజ్ పేయి స్మృతి వనాన్ని అమరావతిలో నిర్మించడానికి ఇక్కడి రైతుల త్యాగమే స్పూర్తి అని తెలిపారు. చరిత్ర గుర్తించే విధంగా అటల్ బిహారీ వాజ్ పేయికి ఘనమైన నివాళి ఇవ్వాలనే స్మృతి వనం నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అటల్ మోదీ సుపరిపాలనా యాత్ర బీజేపీ ప్రారంభించిందని, 26 జిల్లా కేంద్రాల్లో అటల్ విగ్రహాలను ప్రతిష్టించేలా కూటమి పనిచేసిందన్నారు.

Chandrababu inaugurates vajyapee statue in Amaravati remembered former pm s contributions

అమరావతిలో వాజ్ పేయి విగ్రహంతో పాటు ఆయన చరిత్ర, సుపరిపాలనను ప్రజలకు తెలిసేలా స్మృతివనం ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సుపరిపాలన దివస్ గా అటల్ జీ జన్మదినాన్ని నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. మంచి వక్త, కవిగా, ప్రజాహృదయ నేతగా అటల్ బిహారీ వాజ్ పేయి దేశ మౌలిక సదుపాయాలకు బలమైన పునాది వేశారన్నారు. వాజ్ పేయి ప్రతిపాదించిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రహదారిని మొట్టమొదట తడ -చెన్నైల మధ్యే ప్రారంభించామని గుర్తుచేశారు.

Chandrababu inaugurates vajyapee statue in Amaravati remembered former pm s contributions

నాలెడ్జి ఎకానమీకి వెన్నెముక అయిన టెలికామ్ సెక్టార్ డీరెగ్యులేషన్ ప్రారంభించి ఆయన ప్రగతికి పునాది వేశారని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ 4జీ రివల్యూషన్ తో ముందుకు దూసుకెళ్తున్నారన్నారు. పీపీపీ విధానంలో దేశాభివృద్ధికి బీజం వేసి ఆచరణలో పెట్టి ఇప్పుడు అగ్రస్థానానికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఓపెన్ స్కై పాలసీ, నగరాల మధ్య రహదారులు లాంటి వివిధ సంస్కరణలు దేశ ప్రగతికి కీలక బిందువుగా నిలిచాయన్నారు. దేశాన్ని అణుశక్తిగా మార్చి ప్రపంచానికి భారతీయుల సత్తా చాటిన ధీశాలి అప్పటి ప్రధాని వాజ్ పేయి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+