'ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు రోజుకు 36 గంటలు కష్టపడుతున్నారు'
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోజుకు 36 గంటలు పని చేస్తున్నారని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోజుకు 36 గంటలు పని చేస్తున్నారని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. పల్లె చెప్పినట్లుగా వచ్చిన వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది.
ఇందుకు సంబంధించిన ఓ ఇమేజ్ కూడా అటాచ్ చేశారు. అందులో ఇలా ఉంది. 'రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు రోజుకు 36 గంటలు పని చేస్తున్నారని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లాంటి నాయకులను ఎంతో సమర్థవంతంగా నారా వారి కుటుంబం ఎదుర్కొంది.' అని చెప్పినట్లుగా ఉంది.

సోమవారం నాడు అనంతపురం జిల్లా హిందూపురంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకున్నా మెరుగైన ప్యాకేజీ ఇచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications