బాబుకు రిమాండ్‌తో మార్మోమోగుతున్న ఒకే ఒక్క పేరు..!!

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలోచంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.. తగిన సాక్ష్యాధారాలతో సహా.

ఈ ఉదయం ఆయనను విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్‌పై సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లు వాదించారు. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలను వినిపించారు.

Chandrababu judicial custody: Who is AAG of AP Ponnavolu Sudhakar Reddy?

చంద్రబాబు తరఫు న్యాయవాదులు వినిపించిన వాదనలతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఏకీభవించలేదు. వందల కోట్ల రూపాయల మేర కుంభకోణంతో ముడిపడి ఉన్న కేసు కావడం వల్ల ప్రధాన నిందితుడు, ఏ1 చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యులు, సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించారు. చంద్రబాబు దాఖలు చేసుకున్న దరఖాస్తును కొట్టివేశారు. 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలిస్తూ తీర్పు జారీ చేశారు.

కాగా ఈ కేసు విచారణ ముగిసినప్పటి నుంచీ రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. అదే- పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అదనపు అడ్వొకేట్ జనరల్. ఆయనే ఈ కేసును వాదించారు. సీఐడీ తరఫున సమర్థవంతంగా తన వాదనలను వినిపించగలిగారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి న్యాయమూర్తికి వివరించగలిగారు.

చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్రా వంటి కొమ్ములు తిరిగిన అడ్వొకేట్ వాదనలను సైతం వీగిపోయేలా చేయగలిగారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. చంద్రబాబు కేసును వాదించడానికి గంటకు రెండు కోట్ల రూపాయలను చంద్రబాబు చెల్లించినట్లు ఇదివరకే వార్తలొచ్చిన విషయం తెలిసిందే. పైగా ఆయనకు సహకరించడానికి 27 మంది ఇతర సీనియర్లు, జూనియర్ న్యాయవాదులు చంద్రబాబు తరఫున వాదించారు.

అలాంటి సీనియర్ అడ్వొకేట్ సమక్షంలో సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి విజయవంతంగా తన వాదనలను ముగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సుధాకర్ రెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా. 2019లో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజుల్లోనే ఆయన అదనపు అడ్వొకేట్ జనరల్‌గా అపాయింట్ అయ్యారు. 2019 జూన్‌లో బాధ్యతలను స్వీకరించారు.

ఆ తరువాత అనేక కేసులను వాదించారు. అమరావతిలో ఆర్5 జోన్, బోగస్ ఓటర్ల జాబితా వంటి కేసులు ఆయనే వాదిస్తోన్నారు. చాలా కేసుల్లో గెలుపోటములను చవి చూశారు గానీ.. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముడుపుల వ్యవహారంలో చంద్రబాబుకు బెయిల్ రాకుండా, ఆయనకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించేలా చేయగలిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+