అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాధ్యత మర్చి ఎమ్మెల్యేలుగా ఎందుకు?, జీతం మాత్రం.: జగన్ పార్టీపై చంద్రబాబు సెటైర్లు

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకని ప్రశ్నించారు.

గాంధీ జయంతి రోజు నుంచే నిరుద్యోగ భృతి అమలు: చంద్రబాబు, ఎంతంటే?గాంధీ జయంతి రోజు నుంచే నిరుద్యోగ భృతి అమలు: చంద్రబాబు, ఎంతంటే?

ఎమ్మెల్యేలుగా ఎందుకు?

ఎమ్మెల్యేలుగా ఎందుకు?

బుధవారం అమరావతిలో ఏర్పాటు చేసిన టీడీపీ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ పోరాడలేక పారిపోయిన పార్టీ అని ఎద్దేవా చేశారు.అసెంబ్లీకి వారు ఎమ్మెల్యేలుగా ఉండటం ఎందుకని ప్రశ్నించారు.

 జీతాలు మాత్రం మర్చిపోలేదే..

జీతాలు మాత్రం మర్చిపోలేదే..

అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత మరిచిన వైసీపీ ఎమ్మెల్యేలు.. జీతాలు మాత్రం తీసుకోవడం మరువలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాజధానికి ఇప్పుడే ఒక రూపు వస్తోందని, 15ఏళ్లలోనే రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

Recommended Video

త్వరలో మంత్రివర్గ విస్తరణ తేల్చేసిన చంద్రబాబు
 కేంద్రం నిధులివ్వదు కానీ..

కేంద్రం నిధులివ్వదు కానీ..

అమరావతి బాండ్ల జారీకి గంటన్నర వ్యవధిలో రూ.2వేల కోట్లు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. ప్రజలకు తమపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని చెప్పారు. కేంద్రం ఏపీకి నిధులివ్వకపోగా.. పీడీ అకౌంట్లపై విమర్శలు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రం విమర్శలకు గట్టిగా సమాధానమివ్వాలని నేతలకు సూచించారు.

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన బీజేపీ నేత రఘురాజుజగన్ సమక్షంలో వైసీపీలో చేరిన బీజేపీ నేత రఘురాజు

ఏపీపై కక్ష సాధింపు..

ఏపీపై కక్ష సాధింపు..

ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువనే చేశామని చంద్రబాబు అన్నారు. సఖ్యతగా ఉంటోందని తెలంగాణకు అన్నీ ఆమోదిస్తున్నారని.. ఏపీ విషయంలో మాత్రం కేంద్రం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రంపై ధర్మ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ప్రత్యేక హోదా పోరాడి సాధించుకుందామని, యువత ఆత్మహత్యలు చేసుకోవద్దని చంద్రబాబు సూచించారు. నాలుగేళ్లలో సగటున 10.5శాతం వృద్ధిరేటు సాధించామని అన్నారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Wednesday lashed out at YSRCP MLAs for not attending assembly sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X