ఎన్నికలకు సీతాదేవి శీలానికి ముడిపెట్టి!: చంద్రబాబు వివాదస్పద వ్యాఖ్యలు

ప్రతీ మూడు నెలలకు ఒకసారి సీతాదేవి శీలాన్ని పరీక్షించిన మాదిరిగా ఎన్నికలు నిర్వహించడం ఏంటంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి వివాదానికి తావిచ్చే వ్యాఖ్యలు చేశారు. గతంలో దళితులుగా పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారు?, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త మాత్రం ఎందుకు వద్దంటుంది? అని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాజాగా మరోసారి నోరు జారారు.

వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న ప్రధాని మోడీ ప్రతిపాదన గురించి ప్రస్తావిస్తూ.. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం స్వాగతిస్తానని చంద్రబాబు అన్నారు. అదే సమయంలో.. ప్రతీ మూడు నెలలకు ఒకసారి సీతాదేవి శీలాన్ని పరీక్షించిన మాదిరిగా ఎన్నికలు నిర్వహించడం ఏంటంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

chandrababu makes controversial comments

ఎన్నికలకు సీతాదేవి శీలానికి ముడిపెడుతూ చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపేవిగా మారాయి. గతంలోను ఇలా వివాదస్పద వ్యాఖ్యల్లో ఇరుక్కుని ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. మురికివాడలో ఉన్న స్కూళ్లలో చదివితే మురికి ఆలోచనలే వస్తాయంటూ పేదలను అగౌరవపరిచేలా గతంలో వ్యాఖ్యలు చేశారు.

తాజా వ్యాఖ్యలపై ప్రతిపక్షం చంద్రబాబును టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు. ఈ లెక్కన చంద్రబాబే స్వయంగా వివాదాలను కొని తెచ్చుకుంటున్నారని చెప్పక తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+