ఢిల్లీలో చంద్రబాబు: కేజ్రీవాల్, శరద్ యాదవ్‌తో భేటీ
Recommended Video

కేజ్రీవాల్, శరద్ యాదవ్‌తో చంద్రబాబు భేటీ..!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుస సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. శనివారం ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లిన ఆయన తొలుత టీడీపీ ఎంపీలతో ఏపీ భవన్‌లో భేటీ అయ్యారు.
లోక్‌తంత్రిక్ జనతాదళ్ వ్యవస్థాపకుడు శరద్ యాదవ్, డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లాతోనూ అయ్యే అవకాశం ఉంది.

చంద్రబాబు తన మీడియా సమావేశంలో ఏపీకి కేంద్రం మొండిచేయి చూపడం, విభజన చట్టం పెండింగ్ అంశాలతో పాటు ఏపీలోని రాజకీయ పరిణామాలు, టీడీపీ లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులను చంద్రబాబు ప్రస్తావించనున్నారు.
రాఫెల్ అంశంతో పాటు సీబీఐ వ్యవహారాలపైనా మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.












Click it and Unblock the Notifications