తేల్చుకోవాల్సిందే, మొహమాటం వద్దు: కేంద్రంపై బాబు అసహనం, తెగదెంపులపై అయ్యన్న
అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతోపాటు మంత్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై అభిప్రాయాలు తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో టీడీపీకి చెందిన మెజార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తంచేశారు.
ఆంధ్రప్రదేశ్ విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం తీరు సరిగా లేదని అభిప్రాయపడ్డారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం జరిగేలా కేంద్రం వ్యవహరించలేదని పలువురు మంత్రులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

చంద్రబాబు తీవ్ర అసహనం
ఏపీకి బడ్జెట్‌లో అన్యాయం చేసిన కేంద్రంపై తీరుపై చంద్రబాబు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చట్టంలో ఉన్నవి కూడా ఇవ్వకపోతే ఎలా? అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. మొహమాటానికి పోతే నష్టపోతామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్రానికి అర్థమయ్యేలా చెప్పాలని అన్నారు.

అన్యాయం-ఆవేదన
బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రులతో చంద్రబాబు అన్నారు. మహారాష్ట్రలో రైల్వే పునరుద్ధరణకు రూ.లక్ష కోట్లు కేటాయించారని, ఏపీలో పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి కేటాయింపులు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ సహా పలువురు కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేశామని, చాలా మేరకు నిధులు వస్తాయని ఆశించాం, కానీ.. బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేవని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఒత్తిడి పెంచాల్సిందే
కేంద్రంపై పూర్తి స్థాయిలో ఒత్తిడి పెంచాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ ఇదే ప్రధాన ఎజెండాగా ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకంటే ఏదీ ముఖ్యం కాదని చంద్రబాబు తేల్చి చెప్పారు. సీనియర్ మంత్రులు యనమల, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులతో సమావేశమయ్యారు సీఎం.

తెగతెంపులంటే..
పొత్తుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని, పొత్తు తెగదెంపులు చేసుకుంటే భవిష్యత్‌లో.. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు వస్తాయని ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. అప్పుడు కేంద్ర నుంచి నిధులు తెచ్చుకోగలమా? అని ఆయన అన్నారు. గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడారు.

బాధాకరమే
ఏపీకి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అయ్యన్నపాత్రుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి నిరాశ కలిగించిందని మంత్రి అయ్యన్న అన్నారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని, మిత్రపక్షంగా ఉన్నా.. ఈ విధంగా కేటాయింపులు జరపడం బాధాకరమని మంత్రి అన్నారు. రైల్వేజోన్ అంశాన్ని సెంటిమెంట్‌గా మార్చింది బీజేపీనే అని, అనేక సభల్లో మోడీ కూడా విశాఖ రైల్వే జోన్‌పై హామీ ఇచ్చారని, అయినా ఈ బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం అసంతృప్తికి గురిచేసిందన్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications