Chandrababu: శపథం నెరవేర్చుకున్న చంద్రబాబు-సీఎంగానే అసెంబ్లీకి రిటర్న్..!
ఏపీలో 2019 ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైన టీడీపీకి అసెంబ్లీలో అప్పట్లో దినదిన గండంగా ఉండేది. 151 సీట్లలో బలంగా ఉన్న అప్పటి అధికార పక్షం వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం జగన్ కూడా విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు టార్గెట్ గా రెచ్చిపోయేవారు. రాజకీయాల్లో అత్యంత సీనియర్ అయిన చంద్రబాబును ఏమాత్రం లెక్కచేయకుండా వ్యక్తిగత విమర్శలు చేసేవారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కి అప్పట్లో అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించారు. కౌరవ సభలో తాను ఉండలేనని గౌరవ సభలో సీఎంగా తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారు.
సీన్ కట్ చేస్తే.. అన్నట్లుగానే తిరిగి ఇప్పుడు సీఎంగానే చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. తన రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో మట్టి కరిపించడమే కాకుండా కనీసం విపక్ష హోదా కూడా లేకుండా చేసేసిన చంద్రబాబు ఇవాళ విజయగర్వంతో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. గతంలో తాను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి దాదాపు రెండున్నరేళ్ల పాటు అసెంబ్లీకి రాకుండా ఉండిపోయిన చంద్రబాబు.. ఇవాళ సీఎంగా తిరిగి అడుగుపెట్టడంతో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

అప్పట్లో అసెంబ్లీలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల హేళనలను భరించి, భరించి చివరికి బహిష్కరణ చేసి వెళ్లిపోయిన చంద్రబాబు తిరిగి శాసనసభకు సీఎంగా అడుగుపెడతారా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఎందుకంటే అప్పటికి పవన్ కళ్యాణ్ తో కానీ, బీజేపీతో కానీ పొత్తు లేదు. అలాగే జనసేన-బీజేపీ పొత్తు కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు తోటి విపక్షాలతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా చాలా విషయాల్లో వెనక్కి తగ్గారు. ఈ మంత్రం ఫలించి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇప్పుడు అన్నట్లుగానే శపథం నెరవేర్చుకుంటూ అసెంబ్లీలో అడుగుపెట్టారు.
-
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!











Click it and Unblock the Notifications