Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మా రెడ్డి ముందు పెద్దిరెడ్డి ఓ బచ్చా, పాపాలుపండిపోతాయి, చంద్రబాబు మాస్ వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం దక్కించుకోవాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైసీపీ ప్రభుత్వానికి సవాలు విసురుతోంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని టార్గెట్ చేసిన మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనుభవం ముందు పాపాల పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఓ బచ్చా అని, పదవుల కోసం వైఎస్ జగన్ కాళ్ల దగ్గర కుర్చున్నాడని, అదే ప్రజల విషయానికి వస్తే చిన్నాపెద్దా అని తేడా లేకుండా వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నాడని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తాగునీరు రాలేదని చెప్పిన మహిళల మీద పెద్దిరెడ్డి అనుచరులు దాడులు చేశారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

Chandrababu Naidu has accused the Peddireddy family of committing anarchy and looting people s property

రాజంపేట లోక్ సభ నియోజక వర్గం పరిదిలోని తంబళపల్లె నియోజక వర్గంలోని పేదల భూములు లాక్కోవడానికి పెద్దిరెడ్డి కుటుంబం అనేక ప్రయత్నాలు చేస్తోందని, అవులపల్లి ప్రాజెక్టు నిర్మాణం పేరుతో రైతుల ఆస్తిని లాక్కునే ప్రయత్నం చేశారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇదే విషయంలో ఎన్ జీటీ జగన్ ప్రభుత్వానికి రూ 100 కోట్ల జరిమానా విధించిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

ఎన్ జీటీ చివాట్లు పెట్టడంతో సిగ్గులేని జగన్ ప్రభుత్వం ఇప్పటికే రూ 25 కోట్లు జరిమానా చెల్లించిందని చంద్రబాబు గుర్తు చేశారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమరనాథ రెడ్డి, కలిచెర్ల కుటుంబం, కనిపిరెడ్డి కుటుంబాలు ఇదే తంబళపల్లె నియోజక వర్గం అభివృద్ధి చేశారని, అయితే ఇప్పుడు పాపాల పెద్దిరెడ్డి తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ఈ నియోజక వర్గంలోకి వచ్చి ఇక్కడి ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

Chandrababu Naidu has accused the Peddireddy family of committing anarchy and looting people s property

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తాను తొమ్మిది ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశానని, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మూడున్నరేళ్లు సీఎంగా ఉన్నారని, ఆ సమయంలో మేము ఇద్దరూ హుందాగా వ్యవహరించామని, మమ్మల్ని చూసి పెద్దిరెడ్డి ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలని, ఆ రోజు మేము ఇద్దరూ కన్నెర్ర చేసుంటే నువ్వు పుంగనూరులో బతికేవాడివా ? అని చంద్రబాబు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని సూటిగా ప్రశ్నించారు.

నువ్వు, నీ కుటుంబం వలస వెళ్లి ఈ రోజులు ప్రజలను భయపెట్టి బతుకుతున్నారని, మేము అధికారంలోకి వచ్చిన తరువాత కొవ్వు ఎక్కి కొట్టుకుంటున్న నీ భరతం పడతామని మాజీ సీఎం చంద్రబాబు నాయడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని హెచ్చరించారు. పుంగనూరుతో పాటు పలు నియోజక వర్గాల్లో పెద్దిరెడ్డి పెత్తనానికి బ్రేకులు పడతాయని, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పాపాల పెద్దిరెడ్డి అంతు చూస్తామని, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లోక్ సభలో అడుగుపెడతారని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ధీమాగా చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+