జేసీ ఎప్పుడూ నా వెంట పడతారు: బాబు ఆసక్తికరం, 'అందుకే జగన్‌ని వాడు అంటాను'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు కర్నూలు జిల్లాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు కర్నూలు జిల్లాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడూ తన వెంట పడతారన్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రికి ఒక్క టీఎంసీ అయినా తాగునీరు ఇవ్వాలని జేసీ ఎప్పుడూ తనను అడుగుతుంటారని, వెంట పడతారని అన్నారు. గతంలో ఎప్పుడు తాడిపత్రికి చుక్క నీరు రాలేదని జేసీ అంటారన్నారు.
కర్నూలు జిల్లాలో జరిగిన జన్మభూమి సభలో వీరిద్దరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు - జేసీ దివాకర్ రెడ్డి మధ్య ఈ ఆసక్తికర చర్చ జరిగింది. కాగా, ఇటీవల జేసీ.. చంద్రబాబు పైన ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేసీ తన వెంట పడతారని బాబు చెప్పడం గమనార్హం.
కాగా, అంతకుముందు జేసీ దివాకర్ రెడ్డి సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. అదే సమయంలో వైసిపి అధినేత జగన్ పైన తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. ఏం మాట్లాడాతాడో వాడికే తెలియదని జగన్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాడు అనడంపై జేసీ వివరణ ఇచ్చారు. జగన్ దగ్గర తనకు ఉన్న చనువుతో ఏకవచనంలో వాడు అంటుంటానని చెప్పారు. వైయస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధం వల్ల జగన్ చిన్నప్పటి నుంచి తనకు తెలుసునని చెప్పారు.
జగన్‌కు తిట్టడం తప్ప మరొకటి తెలియదన్నారు. జగన్ తిక్కముండా కొడుకు అని కాస్త ఘాటైన పదజాలం ఉపయోగించారని కూడా తెలుస్తోంది. ప్రజల ఓట్లు కావాలనుకునే వారు పట్టిసీమను వ్యతిరేకిస్తారా అని నిలదీశారు. ప్రజలందరూ పోలవరం కావాలని కోరుకుంటుంటే జగన్ ఎందుకు వ్యతిరేకిస్తూన్నాడో అర్థం కావడం లేదన్నారు.












Click it and Unblock the Notifications