కేంద్రం పాత పాటే పాడింది, జైట్లీ ప్రకటనపై అసంతృప్తి

అమరావతి: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ మీడియా సమావేశాన్ని అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో ఉండి చంద్రబాబునాయుడు వీక్షించారు. బాబుతో పాటు కొందరు మంత్రులు కూడ బాబుతో పాటు జైట్లీ మీడియా సమావేశాన్ని తీలకించారు.

ఏపీకి కేంద్రం నుండి నిధుల కేటాయింపు విషయంలో వివక్ష కొనసాగుతోందని టిడిపి తీవ్ర అసంతృప్తితో ఉంది. అయితే కేంద్రం నుండి సానుకూలంగా లేదని టిడిపి ప్రజా ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని బుధవారం నాడు ఏపీ అసెంబ్లీలో చంద్రబాబునాయుడు సీరియస్‌గా మాట్లాడారు. ఈ తరుణంలో జైట్లీ నుండి సానుకూలంగా స్పందన వస్తోందని టిడిపి ప్రజా ప్రతినిధులు భావించారు. కానీ, ఆశించిన స్పందన లేదనేది టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు.

కేంద్ర మంత్రి జైట్లీ ప్రకటనపై బాబు అసంతృప్తి

కేంద్ర మంత్రి జైట్లీ ప్రకటనపై బాబు అసంతృప్తి

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబునాయుడు ప్రకటన తర్వాత కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం సాయంత్రం స్పందించారు. కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు కేటాయింపులపై టిడిపి ప్రజా ప్రతినిధులు ఆశించారు. కానీ, జైట్లీ ప్రెస్ మీట్ పై చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేంద్రం పాతపాటే పాడిందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

మంత్రులతో కలిసి జైట్లీ మీడియా సమావేశాన్ని చూసిన బాబు

మంత్రులతో కలిసి జైట్లీ మీడియా సమావేశాన్ని చూసిన బాబు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశాన్ని అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో ఇతర మంత్రులతో కలిసి చంద్రబాబునాయుడు చూశారు. జైట్లీ ప్రెస్‌మీట్‌‌ సమయంలో బాబు సమక్షంలో ఏపీ ఆర్ధిక శాఖ అధికారులు కూడ ఉన్నారు. జైట్లీ ప్రెస్ మీట్ ‌లో కొత్త దనం లేదని చంద్రబాబునాయుడు సహ ఇతర మంత్రులు అభిప్రాయపడ్డారు.

కేంద్రం పాత పాటే పాడింది

కేంద్రం పాత పాటే పాడింది

ఏపీకి నిధుల కేటాయింపు విషయమై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పాత పాటే పాడారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.రాష్ట్రం పరిస్థితి తెలిసి కూడ కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది.

జైట్లీ ప్రకటనకు కౌంటరివ్వనున్న బాబు

జైట్లీ ప్రకటనకు కౌంటరివ్వనున్న బాబు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనకు ధీటుగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బదులిచ్చే అవకాశం కన్పిస్తోంది. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హమీల విషయమై ఏం చేసిందని బాబు వివరించే అవకాశం ఉంది. కేంద్రం తీరు పట్ల చంద్రబాబునాయుడు అసంతృప్తిగా ఉన్నారు.బిజెపితో పొత్తు విషయమై కీలకమైన ప్రకటన చేసే అవకాశం లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+