లోకేష్ స్థానంపై బాబు, ఎపి హ్యాపీగాఉంటే: జగన్‌పై టిడిపి
హైదరాబాద్: ప్రభుత్వంలో నారా లోకేష్‌కు ఎలాంటి స్థానం కల్పిస్తారనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎవరెవరు ప్రజలకు సేవ చేయాలంటే వారు చేస్తారని, దానికి తగ్గట్టుగానే ఉంటుందని చంద్రబాబు నేరుగా స్పందించేందుకు నిరాకరించారు.
మంత్రివర్గ కూర్పుపై పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు సోమవారం స్పందించారు. తన పరిమితులను ఎమ్మెల్యేలు అర్థం చేసుకోవాలని కోరారు. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు 225కు పెరుగుతాయని, అవకాశాలు ఇంకా ముందుముందు పెరుగుతాయన్నారు.

జగన్‌పై మండిపడ్డ రాజేంద్ర ప్రసాద్
ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ లేఖ రాయడం ఆయన అపరిపక్వతకు నిదర్శనమని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మంగళవారం అన్నారు. చంద్రబాబు సంతకంతో ప్రజలు ఆనందంగా ఉంటే జగన్ ఓర్చుకోలేకపోతున్నారన్నారు. విషయ పరిజ్ఞానం లేకుండా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు.
రాజీనామా
ఆంధ్రప్రదేశ్ అడ్వోకేట్ జనరల్ (ఏజీ), అదనపు అడ్వోకేట్ జనరల్ (అదనపు ఏజీ)లు మంగళవారం రాజీనామా చేశారు. తమ రాజీనామాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు.












Click it and Unblock the Notifications