అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలకృష్ణ నవ్వు, బాబు పాదాభివందనం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తుళ్లూరు మండలం గుంటూరు జిల్లాలో భూమిపూజ శనివారం జరిగింది.

చంద్రబాబు దంపతులు శిలాన్యాసం చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో ఆహూతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సింగపూర్‌ను తలదన్నే రాజధానిని నిర్మిస్తానని, దానికి మొదటి కూలీని నేనే అవుతానని చెప్పారు.

శనివారం ఉదయం గూ.8.49 నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి భూమిపూజ నిర్వహించి శిలాస్థాపన చేశారు. రాజధానికి భూములిచ్చిన వారికి పాదాభివనందం అని చంద్రబాబు అన్నారు.

రాజధానికి భూమిపూజ

రాజధానికి భూమిపూజ

రాజధాని నగరమైన అమరావతికి మందడం గ్రామంలోని సర్వే నెంబరు 135, 136లో భూమి పూజా కార్యక్రమాలు కోలాహలంగా జరిగాయి. వేదపండితుల మంత్రాలతో మందడం గ్రామం మార్మోగింది. చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి, ఆయన తనయుడు లోకేష్‌లు సంప్రదాయ వస్త్ర ధారణలో భూమి పూజ కార్యక్రమానికి తరలివచ్చారు.

రాజధానికి భూమిపూజ

రాజధానికి భూమిపూజ

భూమి పూజ కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భువనేశ్వరి, లోకేష్‌లతో కలిసి వచ్చిన చంద్రబాబు వేద పండితుల మంత్రాల మధ్య అమరావతి రాజధాని నగర నిర్మాణానికి భూమిపూజ చేశారు.

నాగలి దున్నుతున్న బాబు

నాగలి దున్నుతున్న బాబు

రాజధాని భూమిపూజ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూజ చేసిన అనంతరం బాలయ్యను కూడా ఆహ్వానించారు. ఆయన నవ్వుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాస్ర్తోక్తంగా వైదిక సంప్రదాయం ప్రకారం భూమి పూజ జరిగింది.

రాజధానికి భూమిపూజ

రాజధానికి భూమిపూజ

రాజధాని నిర్మాణానికి తాడికొండ నియోజకవర్గం ప్రజల తరపున రూ.11.9 లక్షల రూపాయల చెక్కును స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్‌ సీఎం చంద్రబాబునాయుడుకు అందజేశారు. నవ్యాంధ్రప్రదేశ్‌ భూమిపూజ కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు తిరుపతి వెంకన్న లడ్డూ, కనకదుర్గమ్మ ప్రసాదం పులిహోర, చక్కెర పొంగలిని పంపిణీ చేశారు.

రాజధానికి భూమిపూజ

రాజధానికి భూమిపూజ

నవ్యాంధ్ర రాజధాని భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు మండుటెండను సైతం లెక్కచేయకుండా తిరుపతి నుంచి దాదాపు 425 కిలోమీటర్లు స్కేటింగ్‌ చేస్తూ వచ్చిన చిన్నారి ఏషాను చంద్రబాబు అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారి ఏషా తన పాకెట్‌ మనీని రాజధాని నిర్మాణానికి విరాళంగా బాబుకు అందజేసింది.

రాజధానికి భూమిపూజ

రాజధానికి భూమిపూజ

చిన్నారి అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ... రాజధాని బ్రహ్మాండంగా ఉంటే తన భవిష్యత్‌ బంగారంగా ఉంటుందనే ఉద్దేశంతో చిన్నారి తన పాకెట్‌ మనీని విరాళంగా ఇచ్చిందన్నారు. ఈ చిన్నారిని స్పూర్తిగా తీసుకుని ప్రతీ ఒక్కరూ రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సీఎం పిలుపునిచ్చారు. చిన్నారి ఏషా మాట్లాడుతూ ఏపీని హైదరాబాద్‌లా కాకుండా సింగపూర్‌లా తీర్చిదిద్దాలని ఆకాక్షించింది.

రాజధానికి భూమిపూజ

రాజధానికి భూమిపూజ

రాజధాని భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. భూమి పూజ రోజు చిరుజల్లులు పడటం శుభసూచికమని తెలిపారు.

రాజధానికి భూమిపూజ

రాజధానికి భూమిపూజ

ఆంధ్రప్రదేశ్‌ బంగారు రాజధాని నిర్మాణానికి కేంద్రం ఖచ్చితంగా సహాయం అందిస్తుందని, అందకు తాము తీవ్రంగా కృషి చేస్తామన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలు, అనవసర చర్చలు అవసరం లేదని స్పష్టం చేశారు.

రాజధానికి భూమిపూజ

రాజధానికి భూమిపూజ

రాజధాని భూమిపూజ జరిగిన ఈ రోజును చరిత్రలో బంగారు అక్షరాలతో రాయాల్సిన రోజు అని అభివర్ణించారు. రాజధాని కోసం భూమి ఇచ్చిన రైతులకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ధన్యవాదాలు తెలిపారు.

రాజధానికి భూమిపూజ

రాజధానికి భూమిపూజ

శనివారం ఉదయం నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు భూమి పూజ చేశారు.

English summary
Chandrababu Naidu performs bhoomi pooja for new capital city of Amaravati
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X