సోషల్ మీడియా దుర్వినియోగం చేస్తున్నారు, అలా రాయొచ్చా:బాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:సోషల్ మీడియాను చాలామంది దుర్వినియోగం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు.

సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టింగ్ లు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.సోషల్ మీడియాలో ఏదైనా రాయొచ్చు అనుకొంటున్నారని, ఇది మంచి పద్దతికాదన్నారు చంద్రబాబునాయుడు.

మరో వైపు ఇదే విషయమై టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా స్పందించారు. అమరావతిపై. టిడిపిపై వైసీపి కుట్రకు పాల్పడుతోందని బోండా ఉమ ఆరోపించారు. రాష్ట్రాభివృద్దిని , పెట్టుబడులను అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారాయన.

chandrababunaidu

రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడానికి ఆ పార్టీ పన్నిన కుట్ర బట్టబయలైందన్నారు.ఇంటూరి రవికిరణ్ వైకాపా ఉద్యోగి అనే విషయం తేటతెల్లమైందన్నారు. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని వైకాపా ఏం చేస్తోందని ప్రజలకు తెలిసిందన్నారు.

శాసనమండలి గౌరవాన్ని వైకాపా బూతుపురాణంగా మార్చిందని ఆయన మండిపడ్డారు.చట్టసభలపై గౌరవం లేని జగన్ ఏ విధంగా చట్టసభల్లో సభ్యుడిగా ఉంటారని ఆయన ప్రశ్నించారు.చట్టసభలను అవమానించిన జగన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra pradesh chief minister Chandrababu naidu responded on Inturi Ravikiran incident on Friday evening. some people misuse the social media, he said.
Please Wait while comments are loading...