ఏపీ రాజధానిలో జపాన్ పాఠశాలలు: పెట్టుబడిదారులకు బాబు హామీ(ఫోటోలు)
హైదరాబాద్: ఏపీ రాజధాని లో పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వేత్తలకు పూర్తి మద్దతు ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో జపనీస్ కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక టౌన్ షిప్‌లు, క్లస్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులో జపాన్ పాఠశాలలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
ఆంధ్రా, నాగార్జున యూనివర్సిటీల్లో జపనీస్ తరగతుల్ని కూడా నిర్వహిస్తామని చెప్పారు. బుధవారం నోవాటెల్ హోటల్‌లో జపాన్, ఇండియా ఎనర్జీ ఫోరం 2015 సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. న్యూ ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డెవల్‌పమెంట్ ఆర్గనైజేషన్ (ఎన్‌ఈడీఓ), సీఐఐ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు.

ఏపీ రాజధానిలో జపాన్ పాఠశాలలు: బాబు
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు, అభివృద్ధికి ఉన్న అవకాశాలు, కొత్త రాజధాని నిర్మాణ ప్రణాళికలు, విద్యుత్ రంగంలో ఏపీ లక్ష్యాలను వారికి వివరించారు. ముఖ్యంగా, సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిపై తీసుకుంటున్న చర్యలను చంద్రబాబువెల్లడించారు.

ఏపీ రాజధానిలో జపాన్ పాఠశాలలు: బాబు
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి భారీ రాయితీలు ఇస్తున్నామని అన్నారు. జపాన్‌తో ఏపీకి ఉన్న బంధాన్ని వివరిస్తూ నవ్యాంధ్రలో అమరావతి సహా 17 బౌద్ధారామాలు ఉన్నాయని చెప్పారు. జపాన్‌తో సాంస్కృతిక బంధాన్ని బలోపేతం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఏపీ రాజధానిలో జపాన్ పాఠశాలలు: బాబు
ఆంధ్రా, నాగార్జున వరిటీల్లో జపనీస్ తరగతుల్ని ప్రారంభిస్తామని, ప్రత్యేకంగా పారిశ్రామిక టౌన్‌షిప్‌లు, పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని, వీటన్నింటి కోసం సీఎంఓలో డెస్క్‌ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వివరించారు.

ఏపీ రాజధానిలో జపాన్ పాఠశాలలు: బాబు
ఎంఈటీఐ, జేఐసీఏ, జేఈటీఆర్‌ఓల భాగస్వామ్యం తో ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేస్తామని, ఎలకా్ట్రనిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, మెరైన్, ఎనర్జీ, ఇంజనీరింగ్, లాజిస్టిక్ రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

ఏపీ రాజధానిలో జపాన్ పాఠశాలలు: బాబు
అనంతరం జపాన్ ఆర్థిక, వ్యాపార, పారిశ్రామిక శాఖల మంత్రి యోచి మియాజనా, పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు, ప్రాధాన్యరంగాలపై చర్చలు జరిపారు.

ఏపీ రాజధానిలో జపాన్ పాఠశాలలు: బాబు
చంద్రబాబు సమక్షంలో ఒకరోజులోనే రూ.35,745 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. వీటిద్వారా 72,210 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, పారిశ్రామిక వేత్తలకూ మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి.

ఏపీ రాజధానిలో జపాన్ పాఠశాలలు: బాబు
దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేందుకు సింగిల్ డెస్క్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని చెబుతూ దానికి సంబంధించిన పోర్టల్‌ను బాబు ఆవిష్కరించారు. బయోటెక్నాలజీ, ఆటోమొబైల్ పాలసీలను వెల్లడించారు.












Click it and Unblock the Notifications