ఈసారి అలా కాదు: కడపకు బాబు! పులివెందులపై ప్రత్యేక దృష్టి
వచ్చే ఎన్నికల్లో పులివెందులలో పాగా వేయాలని టిడిపి ఉవ్వీళ్లురూతోంది. ఈ నేపథ్యంలో త్వరలో సీఎం చంద్రబాబు కడప జిల్లా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. త్వరలో ఆయన జిల్లాలో పర్యటించనున్నారు.
కడప/అమరావతి: వచ్చే ఎన్నికల్లో పులివెందులలో పాగా వేయాలని టిడిపి ఉవ్వీళ్లురూతోంది. ఈ నేపథ్యంలో త్వరలో సీఎం చంద్రబాబు కడప జిల్లా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. త్వరలో ఆయన జిల్లాలో పర్యటించనున్నారు.
సీఎం చంద్రబాబు రాయచోటి, కడప నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇప్పటికే జిల్లా నేతలకు సమాచారం అందింది. అధికారులు, నేతలు సిద్ధమవుతున్నారు. ఈ నెల 10 నుంచి 15 తేదీల్లో చంద్రబాబు వచ్చే అవకాశముంది.

కడప రావడం, నంద్యాల వెళ్లడం
అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు పలు ప్రారంభోత్సవాలు చంద్రబాబు చేతుల మీదుగా ఉండేలా కసరత్తు చేస్తున్నారు. గత రెండు నెలలుగా నాలుగైదుసార్లు చంద్రబాబు కడపకు వచ్చారు. కానీ విమానాశ్రయానికి రావడం ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలో నంద్యాల వెళ్లడమే జరిగింది.

ఈ రెండు నియోజకవర్గాల్లో
ఈసారి మాత్రం కేవలం జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంగా కడప, రాయచోటి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారని తెలుస్తోంది. టిడిపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డితో పాటు ఆయన సోదరుడు రమేష్ రెడ్డి ఇంచార్జిగా ఉన్న రాయచోటిలలో పర్యటన ఉండనుందని తెలుస్తోంది.

నేతలు విదేశీ పర్యటనలో ఉన్నందున..
శ్రీనివాస రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. రెండ్రోజుల్లో ఆయన కడపకు రానున్నారు. మరోవైపు, నాలుగు రోజుల్లో పులివెందులకు చెందిన ఇద్దరు కీలక నాయకులు దక్షిణాఫ్రికా వెళ్లనున్నారని, దీంతో అందరు ఉండేలా చూసుకొని చంద్రబాబు పర్యటన ఖరారు చేయనున్నారని తెలుస్తోంది. రాయచోటిలో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

నంద్యాల ఉప ఎన్నికల తర్వాత
నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ మున్సిపల్ ఫలితాల అనంతరం చంద్రబాబు కడప జిల్లాకు వస్తున్నారు. పైగా జగన్ నియోజకవర్గమైన పులివెందులపై టిడిపి దృష్టి సారించింది. దీంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో అధికారిక, పార్టీ కార్యక్రమాలు ఉండనున్నాయి.












Click it and Unblock the Notifications