పాత చంద్రబాబునైతే నేనేంటో చూపించేవాడిని: బాబు సంచలనం
ఒకప్పటి చంద్రబాబునైతే నేనేంటో చూపించేవాడిని అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైద్య, ఆరోగ్యశాఖాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: ఒకప్పటి చంద్రబాబునైతే నేనేంటో చూపించేవాడిని అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైద్య, ఆరోగ్యశాఖాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య, ఆరోగ్యశాఖాధికారులు బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో చోటుచేసుకొంటున్న ఆంత్రాక్స్ కేసులు, మన్యంలో విషజ్వరాల తీరుపై బాబు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. ఈ విషయమై సోమవారం నాడు జరిగిన మంత్రివర్గం సమావేశంలో ఆయన అధికారులను తీరును తప్పుబట్టారు.

కనీస అవగాహన లేకుండానే వారు వ్యవహరిస్తున్నారని ఆయన అధికారులను తప్పుబట్టారు. రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో జబ్బులతో ప్రజలు ఇబ్బందిపడుతోంటే యంత్రాంగం ఏం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
మంత్రివర్గసమావేశంలో మన్యంలో ఆంత్రాక్స్ కేసుల గురించి చర్చ జరిగింది. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాల కొండయ్య తమ శాఖ పరంగా చేపట్టిన చర్యల గురించి వివరించారు.అయితే ఈ సమావేశంలో బాబు జోక్యం చేసుకొన్నారు.
ఈ లెక్కలన్నీ మంత్రులకు తెలుసునని చెప్పారు. వాటివల్ల ప్రయోజనం లేదన్నారు. సమస్య తలెత్తకుండా చూడడం ముఖ్యమని కాస్త ఘాటుగానే చెప్పారు. సమస్య వచ్చినప్పుడు తాను గట్టిగా మాట్లాడితేనే అధికారులు స్పందిస్తున్నారన్నారు. ఆపై మళ్ళీ వదిలేస్తున్నారని చెప్పారు.
Recommended Video

బాధ్యులైన నలుగురైదుగురుపై చర్యలు తీసుకొంటేనే అందరూ దారికి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.వైద్య,ఆరోగ్యశాఖాధికారులు బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారన్నారు.మన్యంలో ఆంత్రాక్స్ కేసుల గురించి అడిగితే అది చాలా మామూలు విషయమే అన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి మాట్లాడడాన్ని ఆయన తప్పుబట్టారు.
తాను ఎంతో సంయమనంతో వెళ్తున్నట్టు చెప్పారు. ఒకప్పటి చంద్రబాబునైతే అలా మాట్లాడినందుకు ఆ డైరెక్టర్ కు తానేంటో చూపించేవాడినని చెప్పారు.నీకు పట్టా ఇచ్చినవాడేవడిని అడిగేవాడినని చెప్పారు.












Click it and Unblock the Notifications