వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను మోడీకి లేఖ రాశా: బాబు ఆనందం, అలజడి.. విషయం తెలిసి ఊరట

|
Google Oneindia TeluguNews

విజయవాడ: రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయాలన్న ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. దేశంలో నల్లధనం నిరోధానికి ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమన్నారు.

రూ.500, రూ.1000 నోట్లు రద్దు కోరుతూ ఇటీవలే తాను ప్రధాని మోడీకి లేఖ రాశానని చెప్పారు. మంగళవారం అర్థరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని చేసిన ప్రకటనపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

chandrababu naidu

రూ.100 నోట్లకు డిమాండ్

మంగళవారం అర్థరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లు రద్దు కావడంతో ఒక్కసారిగా రూ.100, రూ.50ల నోట్లకు డిమాండ్‌ పెరిగింది. రూ.100 నోట్ల కోసం ప్రజలు ఏటీఎంల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. ప్రజల వద్ద ఉన్న రూ.100 , రూ.50 నోట్లు ఎవరికి వారు దాచుకోవడంతో రూ.500, రూ.వెయ్యి నోట్లకు చిల్లర కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మోడీ అనూహ్యం, గందరగోళం: ఏటీఎంలలో డిపాజిట్, డ్రా చేసేందుకు భయంమోడీ అనూహ్యం, గందరగోళం: ఏటీఎంలలో డిపాజిట్, డ్రా చేసేందుకు భయం

ఇంటి అద్దె, పాల బిల్లు, బకాయిలు ఉన్న వెంటనే చెల్లించేందుకు రంగంలోకి దిగుతున్నారు. రూ.500, రూ.1000 నోట్లు తీసుకునేందుకు మాత్రం వారు వెనుకాడుతున్నారు. మంగళవారం రాత్రి 8.30 గంటల నుంచి దేశంలో ఈ విచిత్ర పరిస్థితి నెలకొంది.

సామన్య ప్రజలకు కొంత ఇబ్బందికరమైనా దేశ భవిష్యత్‌ దృష్ట్యా ఈ నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకోవాలని ప్రధాని మోడీ కోరారు. ఏటీఎంల ద్వారా మొదటి కొద్ది రోజుల పాటు ప్రతి కార్డుకు రూ.2వేల నగదు తీసుకోవచ్చని ప్రధాని మోడీ తెలిపారు.

రూ.500, రూ.1000 నోట్ల రద్దు: సంచలన నిర్ణయంపై ఫలించిన బాబు పోరాటంరూ.500, రూ.1000 నోట్ల రద్దు: సంచలన నిర్ణయంపై ఫలించిన బాబు పోరాటం

ఊపిరి పీల్చుకున్న జనాలు

తొలుత రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకటనతో అందరిలోను అలజడి ప్రారంభమైంది. ఇప్పటికిప్పుడు రద్దు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నించారు. అయితే పాత రూ.500, రూ.1000 నోట్లు బయట చెల్లుబాటు కాకపోయినా మార్చుకునేందుకు అవకాశం ఇచ్చారు. దీంతో అసలు విషయం తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

English summary
Chandrababu Naidu welcomes abolishment of Rs.500 and 1000 currency notes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X