బీజేపీపై చంద్రబాబు నయా స్కెచ్ - ఇరకాటంలో పవన్ కల్యాణ్: ఆట మొదలు..!?

చంద్రబాబు తాజా నిర్ణయాలు రాజకీయంగా ఉత్కంఠ ను పెంచుతున్నాయి. బీజేపీ స్పందన ఆసక్తి కరంగా మారుతోంది.

ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి పెంచుతోంది. ఎన్నికల్లో గెలవటమే లక్ష్యంగా చంద్రబాబు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. టీడీపీ -జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ.. మరింతగా బలం పెంచుకొనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రాంతాలు - సామాజిక సమీకరణాల వారీగా కొత్త స్కెచ్ అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు బీజేపీతో పొత్తు కోసం వేచి చూసే ధోరణితో కనిపించిన టీడీపీ..ఇప్పుడు వ్యూహం మార్చినట్లు స్పష్టం అవుతోంది. తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలతో బీజేపీతో పొటుగా పవన పైనా ఒత్తడి పెంచుతోంది. వైసీపీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఏ అవకాశాన్ని వదులు కోవటానికి సిద్దంగా లేరు. అందులో భాగంగానే తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.

బీజేపీకి చంద్రబాబు తొలి షాక్..!

బీజేపీకి చంద్రబాబు తొలి షాక్..!


2019 ఎన్నికల వేళ బీజేపీకి చంద్రబాబు దూరం అయ్యారు. ఆ ఎన్నికల్లో ఫలితాల తరువాత టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. ఆ తరువాత బీజేపీ - కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడా చంద్రబాబు వ్యవహరించలేదు. రెండు సందర్భాల్లో ఢిల్లీలో ప్రధాని నిర్వహించిన సమావేశాలకు చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఆ రెండు సమావేశాలను చంద్రబాబు సద్వినియోగం చేసుకున్నారు. ఇక, వచ్చే ఎన్నికల పైన చంద్రబాబు సీరియస్ గా ఫోకస్ చేసారు. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో జనసేనతో పొత్తుకు సిద్దమయ్యారు. అటు బీజేపీతోనూ మైత్రికి సంకేతాలు ఇచ్చారు. కానీ, బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటున్నారు. అటు పవన్ కల్యాణ్ పైన టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ నుంచి ఒత్తిడి కొనసాగుతోంది. దీంతో, తాజాగా చంద్రబాబు బీజేపీకి తొలి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు.

బీజేపీ నేతకు టీడీపీలోకి ఎంట్రీ..!

బీజేపీ నేతకు టీడీపీలోకి ఎంట్రీ..!

బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేసారు. తొలుత కన్నా జనసేనలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ, ఆయనకు టీడీపీ నుంచి వచ్చిన ఆఫర్ తో ఆ పార్టీలో చేరేందుకు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీతో పొత్తు కారణంగా జనసేనలో చేరేందుకు కన్నా ఆసక్తి చూపినా..జనసేన నేతల నుంచి సరైన స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో.. టీడీపీలో చేరాలని డిసైడ్ అయ్యారు. అయితే, అటు బీజేపీ - జనసేన తో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న చంద్రబాబు.. ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేసిన నేతను తన పార్టీలో చేర్చుకోవటం కొత్త ఎత్తుగడగా కనిపిస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా తమ పార్టీలో చేరటం ద్వారా గుంటూరు జిల్లాలో బలం పెరుగుతుందని టీడీపీ అంచనాగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయనకు సరైన ప్రాధాన్యత ఇస్తామనే హామీతో పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఇప్పుడు కన్నా టీడీపీ వైపు వెళ్తున్నారనే సమాచారం బీజేపీలో చర్చకు కారణమవుతోంది.
పవన్ కళ్యాణ్ పై పెరుగుతున్న ఒత్తిడి

పవన్ కళ్యాణ్ పై పెరుగుతున్న ఒత్తిడి


వైసీపీ లక్ష్యంగా పవన్ కల్యాణ్ టీడీపీతో జత కట్టేందుకు సిద్దమయ్యారు. ఇదే సమయంలో బీజేపీని తమతో కలుపు వెళ్లాలనేది చంద్రబాబు - పవన్ వ్యూహం. ఇప్పటి వరకు బీజేపీ నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. ఇదే సమయంలో టీడీపీతో కలిసి పవన్ జత కడుతున్న వేళ..బీజేపీ నుంచి పరోక్షంగా ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న వేళ..ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్న వారికి టీడీపీ వేదికగా మారటం ఆసక్తి కరంగా మారుతోంది. కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత గతంలో టీడీపీలో పని చేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు తిరిగి ఆ నేత సైతం టీడీపీలో రీ ఎంట్రీకి సిద్దం అవుతున్నట్లు సమాచారం. టీడీపీ అమలు చేస్తున్న తాజా వ్యూహాలు టీడీపీ-జనసేన - బీజేపీ పార్టీల మధ్య ఎటువంటి సమీకరణాలకు దారి తీస్తాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+