మంత్రి పదవి: మోడీ ఆఫర్‌ను తిరస్కరించిన చంద్రబాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: మంత్రివర్గ విస్తరణలో తెలుగుదేశం పార్టీకి మరో మంత్రిపదవి ఇవ్వడానికి ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు వచ్చినట్లు సమాచారం. అయితే, దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు తిరస్కరించినట్లు చెబుతున్నారు.

సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బిజెపి నేత ఒకరు చంద్రబాబుకు ఫోన్ చేసి, కేబినెట్‌లో సహాయ మంత్రి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. అంతకన్నా ముందు శివసేనకు ఒక మంత్రి పదవి అదనంగా ఇవ్వడానికి బిజెపి ముందుకు వచ్చింది . అయితే శివసేన ఆ ఆఫర్‌ను తిరస్కరించింది. ఆ తర్వాతనే చంద్రబాబుకు బిజెపి నేత ఫోన్ చేశారని వార్తలు వస్తున్నాయి.

 Chandrababu rejects Modi's offer of ministry to TDP

తనకు కేంద్రంలో మరో మంత్రి పదవి తీసుకోవడం వల్ల తమకు ఒనగూరే అదనపు ప్రయోజనం ఏమీ లేదని, అంతకన్నా ముంేదు అదనపు నిధులు ఇవ్వడం, పెండింగ్ సమస్యలు పరిష్కరించడదం అవసరమని ఆయన భావించినట్లు సమాచారం.

తెలుగుదేశం పార్టీ మంత్రి పదవి తీసుకోవాలనుకుంటే తెలంగాణ నుంచి గరికపాటి మోహన్‌రావు, ఏపి నుంచి తోట నరసింహం, నిమ్మల కిష్టప్పల్లో ఒకరికి అవకాశం లభించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో మిత్రపక్షాలు ఆర్పీఐ, అప్నాదళ్‌లకు చోటు దక్కుతోంది. పీడీపీ నుంచి ఇప్పటికే ముగ్గురు మంత్రివర్గంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాశ్మీరు ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా తమకు మంత్రి పదవులు వద్దని చెప్పినట్లు తెలిసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Andhra Pradesh CM Nara Chandrababu Naidu rejected to take minister post for Telugu Desam party.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి