చంద్రబాబుది మొసలి కన్నీరు... రాజధానిపై స్వార్ధంతోనే కుట్రలు .. మంత్రి అవంతి ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అవంతి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని,మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు.ఐదు సంవత్సరాలు అమరావతి పేరిట కాలయాపన చేశారని, అమరావతిలో చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని మండిపడ్డారు. టిడిపి హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో ఏమీ చేయకుండా ఇప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసం కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

 విశాఖకు చంద్రబాబు చేసిందేంటి?

విశాఖకు చంద్రబాబు చేసిందేంటి?

విశాఖకు చాలా చేస్తామని చెప్పిన చంద్రబాబు ఏమీ చేయలేదని ఆరోపించిన మంత్రి అవంతి శ్రీనివాస్, ఐదు సంవత్సరాల కాలంలో విశాఖను చంద్రబాబు పర్యాటకంగా ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఉన్న డబ్బులు అన్నీ అమరావతికి పెట్టి,సంక్షేమ పథకాలను పట్టించుకోలేదని, ప్రజలను గాలికొదిలేశారని విమర్శలు గుప్పించారు. రాజధాని అమరావతి కోసం చంద్రబాబు అంతా చేస్తే రాజధాని ప్రజలు చివరకు లోకేష్ కు ఎందుకు ఓటు వేయలేదని ప్రశ్నించారు మంత్రి అవంతి శ్రీనివాస్.

 అమరావతి రైతుల ఉద్యమంపై వైసీపీ నేతలు ఎవరూ తప్పుగా మాట్లాడలేదు

అమరావతి రైతుల ఉద్యమంపై వైసీపీ నేతలు ఎవరూ తప్పుగా మాట్లాడలేదు

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు మంత్రి . అతి తక్కువ సమయంలోనే విశాఖ ఆదాయ వనరుగా మారనుందని అన్నారు. విశాఖ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు మాట్లాడవద్దని అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు . వైసిపి ప్రభుత్వం రాజధాని అమరావతికి వ్యతిరేకంగా లేదని, అమరావతి రైతులకు న్యాయం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అమరావతి రైతుల ఉద్యమంపై వైసీపీ నేతలు ఎవరూ తప్పుగా మాట్లాడలేదని మంత్రి అవంతి తెలిపారు.

Recommended Video

    Pydikondala Manikyala Rao: కరోనాతో మృతి చెందిన Former Minister & BJP Leader Manikyala Rao
     చంద్రబాబువి అన్నీ కుట్రలే .. 23 సీట్లు అందుకే

    చంద్రబాబువి అన్నీ కుట్రలే .. 23 సీట్లు అందుకే

    అమరావతి రాజధానిగా ఉంచుతూనే విశాఖ, కర్నూలును అభివృద్ధి చేస్తామని అమరావతి రాజధానిగా తొలగించటం లేదంటూ మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబు అడుగడుగునా కుట్రలకు పాల్పడుతున్నారని, అందుకే ఏపీ ప్రజలు 23 సీట్లకే టిడిపిని పరిమితం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఉదయం సింగపూర్ మధ్యాహ్నం చైనా కోసం మాట్లాడే వారిని, గ్రాఫిక్స్ లోనే అమరావతిని చూపించారని విమర్శించారు మంత్రి అవంతి. అమరావతి రైతులపై అంత ప్రేమ ఉంటే లోకేష్ ని ఎందుకు ఓడించారు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలని , మొసలి కన్నీరు కార్చడం మానాలని హితవు పలికారు మంత్రి అవంతి శ్రీనివాస్.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+