చంద్రబాబు 'హ్యాపీ' కాస్తా జగన్ కు 'అన్ హ్యాపీ'- యూటర్న్ ఎఫెక్ట్-అమరావతి తేలితేనే !

ఏపీలో గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాగానే వెనక్కి తీసుకుంది. దీంతో ఆ నిర్ణయంతో ప్రభావితమైన ఓ కీలక ప్రాజెక్టు కాస్తా ఇప్పుడు న్యాయవివాదాల్లో చిక్కుకుంది. అంతే కాదు దీనికి ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చిన సంస్ధ కూడా చిక్కుల్లో పడింది. దీంతో వైసీపీ సర్కార్ ఇప్పుడు ఏం చేయబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ మొత్తం వ్యవహారం అమరావతి రాజధానితో ముడిపడి ఉండటం ఇక్కడ విశేషం.

హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు

హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు


గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో రాజధాని ఏర్పాటుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్న రోజుల్లో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. 2018లో మధ్యతరగతికి రాజధానిలో చౌకగా ఇళ్ల నిర్మాణం చేసి ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వ సంస్ధ సీఆర్డీయే ముందుకొచ్చింది. దీంతో 12 అంతస్తుల్లో వంద ప్లాట్ల చొప్పున మొత్తం 1200 ప్లాట్లను అమ్మకానికి పెట్టింది. ఇవి గంటలోనే అమ్ముడుపోయాయి. అప్పట్లో అమరావతి రాజధానిలో భూములు, ఇళ్లకు ఉన్న డిమాండ్ ఇందుకు కారణం. దీంతో ఈ ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేసి ఇచ్చేలా ప్రభుత్వం ఎస్పీ గ్రూప్ కు అప్పగించింది.

 ఫ్లాట్ల కోసం ఒప్పందం ఇలా

ఫ్లాట్ల కోసం ఒప్పందం ఇలా

2018లో ప్రభుత్వం తరఫున సీఆర్డీఏ ఈ ప్రాజెక్టులో భాగంగా 1200 ప్లాట్లను నిర్మించి ఇచ్చేందుకు వీలుగా కస్టమర్లతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. 10 శాతం మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2021 డిసెంబర్ నాటికి ఫ్లాట్ పూర్తి చేసి ఇచ్చే షరతుతో కస్టమర్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో అంతా సవ్యంగా జరిగితే మొన్న డిసెంబర్ నాటికి ప్లాట్లన్నీ నిర్మాణం పూర్తి చేసుకుని కస్టమర్ల చేతికి రావాల్సి ఉంది. కానీ అలా జరగలేదు.

 జగన్ యూటర్న్ తో షాక్

జగన్ యూటర్న్ తో షాక్


గతంలో అమరావతిని రాజధానిగా ప్రకటించి అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఎన్నికలు రావడంతో చంద్రబాబు ప్రభుత్వం స్ధానంలో జగన్ సర్కార్ అధికారం చేపట్టింది. అధికారంలోకి రాగానే ఆరునెలల్లో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చేసింది. దీంతో గతంలో అసెంబ్లీలో అమరావతిని రాజధానికి ఒప్పుకున్న జగన్ రాజధానిపై యూటర్న్ తీసుకున్నట్లయింది. ఈ దెబ్బతో అమరావతిలో అందరి జాతకాలు తలకిందులయ్యాయి. ముఖ్యంగా రైతులతో పాటు ఇక్కడ భూములు, ఆస్తులు కొన్నవారికి చుక్కలు కనిపించడం మొదలైంది ఇదే క్రమంలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది.

Recommended Video

    Chandrababu Naidu - Nitin Gadkari మధ్యలో AP CM Jagan | TDP VS BJP | Oneindia Telugu
     చంద్రబాబు హ్యాపీ- జగన్ కు అన్ హ్యాపీ

    చంద్రబాబు హ్యాపీ- జగన్ కు అన్ హ్యాపీ


    చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ప్రాజెక్టు నిర్ణీత సమయంలో పూర్తి కావాల్సి ఉండగా.. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో అది కాస్తా నిలిచిపోయింది. దీంతో ఈ ప్రాజెక్టులో భాగంగా ప్లాట్లు కొన్న వారు ఇప్పుడు తమ ఒప్పందం ఉల్లంఘన జరిగిందంటూ సీఆర్డీయేకు నోటీసులు పంపారు. హ్యపీ నెస్ట్ ప్రాజెక్టు జాప్యంపై మొత్తం 28 కస్టమర్లు సీఆర్డీయేకు లీగల్ నోటీసులు పంపారు. ఆలస్యానికి పరిహారంగా తాము చెల్లించిన 10 శాతం మొత్తంతో పాటు అదనంగా 14 శాతం వడ్డీ చెల్లించాలని ఇందులో కోరారు. నష్టపరిహారం కింద మొత్తం 20 లక్షలు ఇవ్వాలని నోటీసుల్లో కోరారు. సీఆర్డీయే దీనిపై స్పందించకపోతే న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు వారు ప్రకటించారు. దీంతో చంద్రబాబు హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు కాస్తా జగన్ హయాంలో అన్ హ్యాపీ నెస్ట్ గా మారిపోయినట్లయింది. అయితే అమరావతి తేలితేనే ఈ ప్రాజెక్టుపై సీఆర్డీయే కానీ ప్రభుత్వం కానీ ఓ నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+