చంద్రబాబు ఆదేశాలతో జగన్ కు స్పెషల్ ట్రీట్ మెంట్..!

ఏపీలో తాజా ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటు, ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం నేపథ్యంలో అందరి దృష్టీ మాజీ సీఎం వైఎస్ జగన్ పైనే నెలకొంది. అసలు జగన్ అసెంబ్లీకి వస్తారా, వస్తే కూటమి ప్రభుత్వం ఆయన విషయంలో ఎలా వ్యవహరించబోతోందనే చర్చ జరిగింది. అయితే మాజీ సీఎం అయిన జగన్ కు ఈసారి విపక్ష హోదా దక్కకపోవడంతో అసెంబ్లీలో ఆయన్ను సాధారణ ఎమ్మెల్యేగానే పరిగణించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అయితే చివరి నిమిషంలో ట్విస్ట్ చోటు చేసుకుంది.

మాజీ సీఎం అయిన వైఎస్ జగన్ విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి వైసీపీ విజ్ఞప్తి చేసింది. శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కు ఈ మేరకు వైసీపీ నుంచి వినతి అందింది. దీంతో ఆయన విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. జగన్ విషయంలో ఎలా వ్యవహరించాలో పయ్యావులకు దిశానిర్దేశం చేశారు. జగన్ హోదాకు భంగం కలుగకుండా చూసుకోవాలని ఆదేశించారు.

Chandrababu special order to legislative affairs minister payyavula keshav on treating ys jagan

దీంతో ఇవాళ అసెంబ్లీకి వచ్చిన జగన్ ను నేరుగా కారుతో పాటు లోపలికి అనుమతించారు. అంతే కాదు ఆయన ప్రమాణస్వీకారం కూడా సాధారణ ఎమ్మెల్యేల తరహాలో ఎక్కడో చివర్లో కాకుండా ముందుకు జరిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత జగన్ కు ప్రమాణస్వీకారం చేసే అవకాశం కల్పించారు. దీంతో జగన్ కూడా ఆ మేరకు వీరి తర్వాత ప్రమాణస్వీకారం చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా బీఏసీలో వైసీపీకి అవకాశం కల్పిస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+