వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచ్చన్న సమరం కొనసాగుతున్న క్రమంలో ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన, బిజెపి కూటమికి మధ్య పోరు హోరా హోరీగా సాగుతుంది. 175 కు 175 స్థానాలను గెలవాలని పట్టుదలతో ఉన్న వైసిపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే ఈ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని కూటమి అన్ని వైపుల నుండి ప్రయత్నాలు చేస్తుంది.
గన్నవరంపై చంద్రబాబు ఫోకస్
ఇక కొన్ని ముఖ్య నియోజకవర్గాల పైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్న కూటమి అక్కడ అభ్యర్థులను ఓడించడం లక్ష్యంగా పెట్టుకుంది. అటువంటి నియోజకవర్గాలలో గన్నవరం నియోజకవర్గం ఒకటి. గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని టిడిపి భావిస్తుంది. ఇక్కడి నుంచి గత ఎన్నికలలో టీడీపీ నుండి వల్లభనేని వంశీ విజయం సాధించారు ఈ నియోజకవర్గంలో అత్యధిక సార్లు టిడిపి నాయకులే గెలిచారు.

వంశీకి చెక్ పెట్టే పనిలో చంద్రబాబు
అయితే గత ఎన్నికల్లో గెలిచిన టిడిపి తరఫున గెలిచిన వల్లభనేని వంశీ ఆ తర్వాత పార్టీ ఫిరాయించి వైసీపీకి మద్దతునిస్తూ చంద్రబాబును టార్గెట్ చేశారు. అంతేకాదు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై కూడా వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు వైసీపీ నుంచి గన్నవరంలో ఎన్నికల బరిలోకి దిగాడు. దీంతో ఇక్కడ వల్లభనేని వంశీకి చెక్ పెట్టాలని చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
యార్లగడ్డ వెంకట్రావును రంగంలో దింపిన చంద్రబాబు
వైసిపి నుండి టీడీపీకి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావును చంద్రబాబు రంగంలోకి దింపి వల్లభనేని వంశీని ఓడించడానికి వ్యూహాలను అందిస్తున్నారు. స్థానికంగా టిడిపికి పట్టు ఉండడంతో ఈసారి మళ్లీ విజయం టిడిపి ఖాతాలో పడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతోని యార్లగడ్డ వెంకట్రావు ఓడిపోగా ఈసారి యార్లగడ్డ వెంకట్రావు గెలుస్తారని ధీమా చంద్రబాబుతో పాటు తెలుగు తమ్ముళ్లలో వ్యక్తం అవుతుంది.

వల్లభనేని వంశీని టార్గెట్ చేస్తున్న యార్లగడ్డ
గత ఎన్నికల్లో గెలిచిన నాటినుండి వల్లభనేని వంశీ నియోజకవర్గంలో ఏమీ అభివృద్ధి చేయలేదని, తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీ టిడిపిని వెన్నుపోటు పొడిచి వైసీపీకి సహకరించారని, వల్లభనేని వంశీకి వ్యక్తిత్వమే లేదని ప్రధానంగా ప్రచారం చేస్తూ యార్లగడ్డ వెంకట్రావు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు.
స్థానిక నేతలతో ఎప్పటికప్పుడు చంద్రబాబు నివేదికలు.. లక్ష్యం అదే
ఇక ఎప్పటికప్పుడు నియోజకవర్గం లోని పరిస్థితిని సమీక్షిస్తూ, చంద్రబాబు స్థానిక నాయకుల నుంచి నివేదికలు తెప్పించుకుంటూ యార్లగడ్డ విజయానికి కూటమి నేతలంతా సహకరించేలా వ్యూహాలు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు బిజీ ఉన్నప్పటికీ గన్నవరంలో వల్లభనేని వంశీని రాజకీయంగా ఓటమిపాలు చేయడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారు.












Click it and Unblock the Notifications