నిన్న కాదని, ఇవాళ మోడీకి బాబు థ్యాంక్స్, జగన్‌కు మళ్లీ ఛాన్స్
అమరావతి: ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానించలేదని ఇటీవల తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పారు. అయితే, తాజాగా మంగళవారం నాడు చంద్రబాబు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీని ఇచ్చినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు అని చంద్రబాబు మంగళవారం నాడు అన్నారు. హోదాతో సమానమైన ప్యాకేజీ ఇచ్చారని చంద్రబాబు చెప్పి, ధన్యవాదాలు తెలిపారు.

కాగా, కొద్ది రోజుల క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, మరో ఇద్దరు కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరిలు రాత్రి పదకొండు గంటల సమయంలో మాట్లాడుతూ.. ఏపీకి హోదాతో సమానమైన ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు.
దానిపై అర్ధరాత్రి సీఎం చంద్రబాబు మాట్లాడారు. దీనిపై వైసిపి మండిపడింది. అర్ధరాత్రి పూట చంద్రబాబు హోదాను కాదని ప్యాకేజీని స్వాగతించడం ఏమిటని ధ్వజమెత్తారు. దీనిపై టిడిపి నేతలు మాట్లాడుతూ.. ప్యాకేజీని చంద్రబాబు స్వాగతించలేదని, ఇచ్చింది తీసుకుంటాం, రావాల్సింది అడుగుతామని చెప్పారన్నారు. ఇప్పుడు చంద్రబాబు.. మోడీకి థ్యాంక్స్ చెప్పి మరోసారి జగన్‌కు ఛాన్స్ ఇచ్చారని అంటున్నారు.












Click it and Unblock the Notifications