జగన్‌తో సహా కొత్తే: బాబు, కాల్ మనీతో చంద్రబాబుకు కొత్త చిక్కులు

హైదరాబాద్: ప్రతిపక్షంలో అధినేత వైయస్ జగన్ సహా చాలామంది కొత్తగా ఎన్నికైన వాళ్లని అందుకే వారికి సభా సంప్రదాయాలు తెలియవని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాల్ మనీ పైన రేపు అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు.

శాసన సభ వాయిదా అనంతరం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. అంబేడ్కర్ గురించి సభలో చర్చకు రానివ్వక పోవడం దురదృష్టకరమన్నారు. వాళ్ల పార్టీలో అందరూ కొత్తవాళ్లేనని అందుకే ఏం తెలియవన్నారు.

17 అంశాలతో ప్రతిపక్షాల ఆరోపణలకు వివరణ

ప్రతిపక్షాల ఆరోపణలకు ప్రభుత్వం 'ఆరోపణలు - వాస్తవాలు' పేరుతో ఓ పుస్తకాన్ని తెచ్చింది. అందులో ఇసుక మాఫియా, ప్రత్యేక హోదా, బాక్సైట్ తవ్వకాలు తదితర అంశాలపై వివరణ ఇచ్చింది.

Chandrababu unhappy with YSRCP

ఏఎస్సై సూర్యప్రకాశ్ కేసు కాకినాడ డిఎస్పీకి అప్పగింత

కాల్ మనీ కేసులో ఏఎస్సై సూర్యప్రకాశ్ పైన ఆరోపణలు వచ్చాయి. సూర్యప్రకాశ్ పైన పలువురు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏఎస్సై కేసును కాకినాడ డిఎస్పీకి అఫ్పగించారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఏఎస్పీ ఘటన పైన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప కూడా స్పందించారు. నిజానిజాలు పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు.

కాకినాడలో 46 కేసులు

కాకినాడలో కాల్ మనీ కేసులు 46 నమోదయ్యాయి. ఇప్పటి వరకు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. సుమోటోగా 28 కేసులు పెట్టారు. ఇప్పటి వరకు 18 ఫిర్యాదులు అందినట్లుగా పోలీసులు చెప్పారు. కాగా, కాల్ మనీ బాధితులు పోలీసు స్టేషన్లకు క్యూ కడుతున్నారు.

కొత్త చిక్కులు.. సాధారణ రుణాలు కలపొద్దని విజ్ఞప్తి

'కాల్ మనీ' వ్యవహారం ఏపీ ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. సాధారణ రుణాలు తీసుకున్న వారు కూడా బాధితులుగా పోలీసు స్టేషన్‌లను ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ రుణాలను 'కాల్ మనీ'లో కలపవద్దని పలువురు విజ్ఞప్తి చేశారు.

పలువురు నేతలు కాల్ మనీ వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు. సాధారణ రుణాలను కాల్ మనీలోకి కలిపే అవకాశాలున్నాయని, కాబట్టి పోలీసులకు తగు సూచనలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+