నివాసమే ఎపి సిఎం చంద్రబాబు క్యాంప్ ఆఫీసు
హైదరాబాద్: తన నివాసాన్నే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుగా ఉపయోగిస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ క్యాంప్ కార్యాలయంగా హైదరాబాదులోని లేక్‌వ్యూ అతిథి గృహాన్ని కేటాయించవద్దని ఆయన అధికారులకు సూచించారు.
వీలైనంత త్వరగా సీమాంధ్రకు సచివాలయాన్ని మార్చాల్సి ఉంటుందని చంద్రబాబు అధికారులతో చెప్పినట్లు సమాచారం. సచివాలయంలోని హెచ్ బ్లాక్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చేందుకు చంద్రబాబు సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

సచివాలయంలో విభజన పనులను త్వరగా పూర్తి చేస్తామని అధికారులు చంద్రబాబుకు చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఇతర ఉన్నతాధికారులు గురువారం చంద్రబాబుతో సమావేశమయ్యారు.
అటు ఆంధ్రప్రదేశ్‌కు, ఇటు తెలంగాణకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అధికారులతో అన్నారు.












Click it and Unblock the Notifications