తిరుమల ప్రపంచానికే ఆదర్శం: చంద్రబాబు(పిక్చర్స్)
తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. రంగనాయకుల మంటపంలో అర్చకులు చంద్రబాబుకు వేదాశీర్వచనం అందజేశారు. తితిదే ఈవో సాంబశివరావు ముఖ్యమంత్రికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా ఈవో, జేఈవో, ఇతర అర్చకులతో భక్తులకు అందుతున్న సౌకర్యాల పై సీఎం చర్చించారు.
తిరుమల ప్రపంచానికే ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు. అర్చకుల మధ్య వివాదాలు ఉండకూడదన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అర్చకుల మధ్య వివాదం వద్దు అని సిఎం చంద్రబాబు నాయుడు సూచించారు. శుక్రవారం ఉదయం అర్చకులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రంగనాయకల మండపంలో అర్చకులతో సమీక్ష జరిపారు. టీడీఈ ఈవో, జీఈవో, ఆలయ ప్రధాన అర్చకులు, డాలర్ శేషాద్రితో చంద్రబాబు చర్చలు జరిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అర్చకుల మధ్య వివాదాన్ని పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. తిరుపతిని ఆధ్యాత్మిక రాజధాని చేస్తామని చంద్రబాబు అన్నారు. తిరుపతిలోని అవిలాల చెరువు, రాజీవ్‌గృహకల్ప ఇళ్లను పరిశీలించారు. శ్రీకాళహస్తి- కాణిపాకం- తిరుపతిల మధ్య ఫాస్ట్‌ట్రాక్ ట్రైన్‌ను ఏర్పాటు చేసి తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేస్తామన్నారు.
ఏపీ మంత్రులు నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం తిరుపతిలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు చేశారు. తిరుపతిలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, తాగునీటి సౌకర్యం కల్పించడం కోసం రూ. 25 కోట్లు ఇవ్వమని తితిదేను కోరామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.
ఆ తర్వాత తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ నివాసానికి వెళ్లారు. ప్రత్యేక హోదాపై ఇప్పటికే కేంద్రానికి పలుమార్లు విన్నవించామన్న ఆయన ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని భావిస్తున్నానన్నారు. తిరుమలలో స్థానికుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

చంద్రబాబు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు.

చంద్రబాబు
రంగనాయకుల మంటపంలో అర్చకులు చంద్రబాబుకు వేదాశీర్వచనం అందజేశారు.

చంద్రబాబు
తితిదే ఈవో సాంబశివరావు ముఖ్యమంత్రికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా ఈవో, జేఈవో, ఇతర అర్చకులతో భక్తులకు అందుతున్న సౌకర్యాల పై సీఎం చర్చించారు.

చంద్రబాబు
భక్తులకు మెరుగైన సేవలందించాలని అధికారులను ఆదేశించారు. తితిదే ప్రక్షాళన నిరంతరం జరిగే ప్రక్రియగా చంద్రబాబు పేర్కొన్నారు.

చంద్రబాబు
విద్య, ఆరోగ్యంపై తితిదే సేవలను విస్తృతం చేయాలని కోరారు. జల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని... కరవును జయించాలనే 'నీరు-చెట్టు' కార్యక్రమాన్నిప్రారంభించామని చెప్పారు.

చంద్రబాబు
తిరుమల ప్రపంచానికే ఆదర్శంగా ఉండాలని ఏపి సిఎం చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు.
తిరుపతిలో అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులను ఆదేశించానన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం కోసం అవసరమైతే మరింత భూమి సేకరిస్తామని సీఎం తెలిపారు. నగరంలో నేరనియంత్రణ కోసం మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తామన్నారు. తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్కడినుంచి విజయవాడ బయల్దేరారు.












Click it and Unblock the Notifications