సంక్రాంతికి ఊరికొచ్చినోళ్లు పోస్టులు పెడితే- ఎమ్మెల్యేలకు బాబు వార్నింగ్..!
ఏపీలో గత ఐదేళ్లుగా రోడ్ల పరిస్ధితిపై ఇతర రాష్ట్రాల్లో సైతం తీవ్ర చర్చ జరిగింది. దీంతో రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు వాటిపై సీరియస్ గా దృష్టిపెట్టారు. ఇందుకోసం పాట్ హోల్ ఫ్రీ ఏపీ (గుంతల్లేని ఏపీ) పేరుతో ఓ కార్యక్రమం కూడా అమలు చేస్తున్నారు. సంక్రాంతి కల్లా రాష్ట్రంలో గుంతల్లేని రోడ్లు ఉండాలని చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు పదే పదే చెప్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఓ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
సంక్రాంతి పండుగకు కేవలం మూడు వారాల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇంకా గుంతలున్న రోడ్లను గుర్తించి వెంటనే రిపేర్లు చేయించాలని సొంత పార్టీ టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. మరో అడుగు ముందుకేసి ఈ సంక్రాంతికి రాష్ట్రానికి వచ్చే వారు ఎక్కడైనా రోడ్లు బాగోలేదని సోషల్ మీడియాలో పోస్టు పెడితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేను బాధ్యుడిని చేస్తానని చెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు గుంతల్లేని రోడ్ల కోసం పరుగులు పెడుతున్నారు.

ఇప్పటికే గత ప్రభుత్వ తప్పిదాలను సరి చేస్తామని పదే పదే చెబుతున్న సీఎం చంద్రబాబు.. అందుకు తగ్గట్లుగానే నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో రోడ్ల పరిస్ధితిపై కూటమి పార్టీలు పలుమార్లు ఆందోళనలు చేశాయి. కాబట్టి ఇప్పుడు అవే రహదారులను రిపేర్లు చేయించడం, ఆ తర్వాత కొత్త రోడ్లు వేయించడం చేయాలని నిర్ణయించారు. ఇందులో అలసత్వం చూపితే చర్యలు తప్పవనే హెచ్చరికలు కూడా చేస్తున్నారు. మరోవైపు ఇతర విషయాల్లోనూ హద్దులు దాటుతున్న ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించి మరీ హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications