లాస్ట్ మినట్‌దాకా మార్పులు: షిండే, హైద్రాబాద్ నోప్రాబ్లం
న్యూఢిల్లీ: చివరి నిమిషం వరకు మంత్రుల బృందం (జివోఎం) నివేదికలో మార్పులు చేర్పులు ఉండవచ్చునని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం అన్నారు. నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక మంత్రి, జివోఎం సభ్యులు చిదంబరంతో షిండే, జైరాం రమేష్ భేటీ అయ్యారు. అనంతరం షిండే విలేకరులతో మాట్లాడారు.
వీలైనంత త్వరగా కేబినెట్ ముందుకు నివేదికను పంపిస్తామని చెప్పారు. బిల్లులో ఎలాంటి లోపాలు ఉండకుండా నిపుణులతో చర్చిస్తున్నామన్నారు. చిన్న లోపాల పైన కూడా దృష్టి సారిస్తామని చెప్పారు. నివేదిక విషయంలో చివరి నిమిషం వరకు మార్పులు చేర్పులు ఉంటాయన్నారు.

హైదరాబాదు, భద్రాచలం పైన ఎలాంటి సమస్య లేదని చెప్పారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే తాము తెలంగాణ బిల్లును ప్రవేశ పెడతామని చెప్పారు. ఇవాళ కేబినెట్ ముందుకు నివేదిక రాదని తెలిపారు. ఎవరూ బాధపడకుండా జివోఎం నివేదిక ఉంటుందని స్పష్టం చేశారు.
బిల్లు రాలేదు: కపిల్ సిబాల్
తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లు తన వద్దకు రాలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ తెలిపారు.

రాయల తెలంగాణపై హోం కసరత్తు?
మరోవైపు రాయల తెలంగాణ అంశంపై హోంశాఖ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాయల తెలంగాణ డిమాండ్ నేపథ్యంలో దీనిపై సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది. పదకొండు జిల్లాలతో కలిపి సీమాంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై తర్జన భర్జన పడుతున్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications