తాలిబన్ల పాలన: ఆరు గంటల తర్వాత పీఎస్ నుంచి చెవిరెడ్డి విడుదల

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జనం చేసిన టిడిపి నేతలు బోండా ఉమ, కేశినేని నానిలను అరెస్ట్ చేయాలని, అప్పటి దాకా తన దీక్ష కొనసాగుతుందని వైసిపి నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి ప్రకటించారు.

ఆ 'ఐపీఎస్' నోరు విప్పితే నిజాలు.. చెప్పాలి, సీఎం సెటిల్మెంట్లు: జగన్ షాకింగ్

ఆయనను అసెంబ్లీ గేటు వద్ద సోమవారం ఉదయం అరెస్టు చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్ తరలించారు. ఆయనను ఉదయం పది గంటల సమయంలో అరెస్ట్ చేసి, నాలుగు గంటల సమయంలో విడుదల చేశారు. ఆరు గంటల నిర్బంధం తర్వాత ఆయన బయటకు వచ్చారు.

Chevireddy Bhaskar Reddy released from PS

ఈ నేపథ్యంలో చెవిరెడ్డి మాట్లాడారు. చంద్రబాబు పాలన తాలిబన్ల పాలన కంటే దారుణంగా ఉందన్నారు. తనను అరెస్టు చేసినా దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. టిడిపి నేతలను అరెస్టు చేయాల్సిందే అన్నారు. చంద్రబాబు పాలనలో సామాన్యుడికే కాదు, పోలీసులకు కూడా రక్షణ లేదన్నారు. తనను నిర్బంధం దుర్మార్గమైన చర్య అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party MLA Chevireddy Bhaskar Reddy on monday released from Mangalagiri police station.
Please Wait while comments are loading...