నీరు-చెట్టు పథకంపై చంద్రబాబు అసంతృప్తి (ఫోటోలు)
హైదరాబాద్: బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా మాట వినని అధికారులను సస్పెండ్ చేయాలని సూచించారు. నీరు-చెట్టు కింద పూడిక తీసిన మట్టిని రైతులు తీసుకెళ్తుంటే తహశీల్దార్, ఆర్డీవోలు పట్టుకుంటున్నారని, తాము చెప్పినా వినడం లేదని డిప్యూటీ సీఎం చినరాజప్ప ఫిర్యాదు చేశారు.
దీంతో రైతులు మట్టి తోలుకోవచ్చని జీఓ ఇచ్చామని, అయినా ఎందుకు అడ్డుకుంటున్నారని సీఎం ప్రశ్నించారు. అధికారులు మటా వినడం లేదని మంత్రులే అనడం సరికాదని, గట్టిగా వ్యవహరించాలంటూ సూచించారు. ఇక ఇసుక రేవుల నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ఎంత వెళ్తోందన్న దానిపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాజెక్టుల వెంట పరిగెడుతున్నారని, రావెల కిశోర్ బాబు కూడా జనంలో తిరుగుతున్నారని ప్రశంసించారు. మరో మంత్రి కామినేని శ్రీనివాస రావు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నారంటూ ప్రశంసించారు. నీరు-చెట్టు కార్యక్రమం అనుకున్నంతగా సాగడం లేదని, దీనిపై దృష్టి పెట్టాలని కోరినట్లు తెలిసింది.
ఇకపై ఎర్రచందనంతో పాటు అటవీ సంపదను కాపాడేందుకు కఠినంగా ఉంటామని, ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న అటవీ చట్టంలో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించామన్నారు. అటవీ సంపద రక్షణ అంశంపై మంత్రివర్గ సమావేశంలో సవివరంగా చర్చించామని సమావేశ అనంతరం మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, నారాయణ మీడియాకు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ను 2014 జూన్ 2 నుండి అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు. గత ఏడాది జూన్ రెండు నుండి 2015 ఏప్రిల్ వరకు బకాయిలను ఏ విధంగా చెల్లించాలన్న అంశంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి నిర్ణయిస్తామన్నారు.
2015 మే నెల నుండి ఇచ్చే వేతనంతో పీఆర్‌సీ పెంపుదల అమలు చేస్తామన్నారు. పీఆర్‌సీకి సంబంధించి ఇతరత్రా సమస్యలేవైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరిస్తామన్నారు. విశాఖ- చెన్నై కారిడార్ అభివృద్ధికి 6,200 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని, ఈ నిధులను ఏసియన్ బ్యాంక్ నుండి రుణంగా తీసుకునేందుకు కేంద ప్రభుత్వం అనుమతి కోరాలని మంత్రివర్గం సమావేశంలో నిర్ణయించారు.
విశాఖపట్నం సమీపంలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. విమానాశ్రయం కోసం అవసరమైన 10 వేల నుండి 12 వేల ఎకరాల భూమిని భూసమీకరణ ద్వారా సేకరిస్తామన్నారు. ఇసుక అవసరమైన వారికి 48 గంటల్లో డోర్‌డెలివరీ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇసుక అమ్మకం వల్ల ఇప్పటి వరకు 410 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు లభించాయన్నారు.

'మాట వినని అధికారులను సస్పెండ్ చేయిండి'
బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా మాట వినని అధికారులను సస్పెండ్ చేయాలని సూచించారు. నీరు-చెట్టు కింద పూడిక తీసిన మట్టిని రైతులు తీసుకెళ్తుంటే తహశీల్దార్, ఆర్డీవోలు పట్టుకుంటున్నారని, తాము చెప్పినా వినడం లేదని డిప్యూటీ సీఎం చినరాజప్ప ఫిర్యాదు చేశారు.

'మాట వినని అధికారులను సస్పెండ్ చేయిండి'
దీంతో రైతులు మట్టి తోలుకోవచ్చని జీఓ ఇచ్చామని, అయినా ఎందుకు అడ్డుకుంటున్నారని సీఎం ప్రశ్నించారు. అధికారులు మటా వినడం లేదని మంత్రులే అనడం సరికాదని, గట్టిగా వ్యవహరించాలంటూ సూచించారు. ఇక ఇసుక రేవుల నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ఎంత వెళ్తోందన్న దానిపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

నీరు-చెట్టు పథకంపై చంద్రబాబు అంసతృప్తి
రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నీరు-చెట్టు పథకం జిల్లాలో సక్రమంగా సాగడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా భూగర్భజలాల పరిరక్షణ, వాతావరణ సమతుల్యత సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యం. అయితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరే దిశగా పథకం పనులు సాగడం లేదని ప్రభుత్వం దృష్టికి వెళ్లిడంతో చంద్రబాబు ఆసంతృప్తి వ్యక్తం చేశారు.

నీరు-చెట్టు పథకంపై చంద్రబాబు అంసతృప్తి
నీరు-చెట్టు పథకం లక్ష్యం చేరడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. దీనిపై ఏ శాఖలో నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పూడికతీతకు అవసరమైన జెసిబి, ట్రాక్టర్లను రవాణా శాఖ అధికారుల సహకారంతో సమకూర్చుకోవాలన్నారు.

నీరు-చెట్టు పథకంపై చంద్రబాబు అంసతృప్తి
ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం లక్ష్యాన్ని చేరుకోవడానికి శ్రమించాలన్నారు. నీరు-చెట్టు పథకం కింద వేసవి చివరకు పనులు పూర్తయితే రానున్న వర్షాకాలంలో వర్షం నీటిని భూగర్భంలోకి పంపవచ్చన్నారు. అలాగే చెరువులు, పొలం గట్లు, రహదారుల వెంట చెట్లను నాటడం ద్వారా మేఘాలను ఆకర్శించి వర్షాలు సమృద్ధిగా కురవడానికి అవకాశం ఉంటుందన్నారు.

నీరు-చెట్టు పథకంపై చంద్రబాబు అంసతృప్తి
చెరువుల్లో పూడికతీత ద్వారా అధికంగా నీరు నిల్వ చేయడమే కాకుండా భూపొరల్లోకి వర్షం నీరు ఇంకి తర్వాతి కాలంలో భూగర్భజల మట్టం తగ్గకుండా పరిరక్షించుకోవచ్చన్నారు. ఈ పనలన్నీ చేపట్టిన తర్వాత నిర్వహణ బాధ్యతను రైతులకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.












Click it and Unblock the Notifications