Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భూమా అడిగారు, శిల్పా అడగలేదు: బాబు ఆగ్రహం, మహిళ కంటతడి

నంద్యాల: ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన శనివారం పర్యటనలో వరాల జల్లు కురిపించారు. పలుచోట్ల మాట్లాడారు. అదే సమయంలో ప్రతిపక్ష వైసిపిపై మండిపడ్డారు.

ఏ నియోజకవర్గంలోనైనా ఎవరైనా చనిపోతే మధ్యంతర ఎన్నికలు అవసరం లేకుండా అదే కుటుంబానికి టిక్కెట్‌ ఇచ్చే సంప్రదాయాన్ని నల్గొండ జిల్లా దేవరకొండలో టిడిపి ముందుకు తీసుకు వచ్చిందని చంద్రబాబు చెప్పారు.

వైసిపిపై ఆగ్రహం.. శిల్పా పెట్టిన కేసులను..

వైసిపిపై ఆగ్రహం.. శిల్పా పెట్టిన కేసులను..

అలాంటి సంప్రదాయానికి వైసిపి తిలోదకాలిచ్చిందని చంద్రబాబు అన్నారు. మీ వద్దకు కొందరు వస్తారని, ఎన్నికల్లో కులం, మతం, అవినీతి డబ్బు ఆశ చూపే నాయకులను నమ్మొద్దని చంద్రబాబు వైసిపిని ఉద్దేశించి అన్నారు. అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి వ్యక్తి టిడిపికి సహకరించాలన్నారు. శిల్పా మోహన్ రెడ్డి గతంలో ముస్లింలపై పెట్టిన కేసులను చట్టప్రకారం పరిష్కరిస్తామన్నారు.

Recommended Video

    Chandrababu discussions In co ordination meeting Over strategies for Nandyal by-polls
    శిల్పా మోహన్ రెడ్డి రాజకీయమే కోరారు

    శిల్పా మోహన్ రెడ్డి రాజకీయమే కోరారు

    చనిపోయే ముందు భూమా నాగిరెడ్డి నంద్యాలను అభివృద్ధి చేయాలని అడిగారని చంద్రబాబు గుర్తు చేశారు. శిల్పా మోహన్ రెడ్డి ఎప్పుడూ అభివృద్ధి గురించి అడగలేదని, రాజకీయమే కోరారన్నారు. ఏడాదిన్నర పదవి కోసం తహతహలాడుతూ పార్టీ మారిన వాళ్లు ఏమి అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. రేపో.. ఎల్లుండో కొందరొస్తారని రకరకాల మాయమాటలు మాట్లాడుతూ రెచ్చగొడతారని, డబ్బుల సంచులు తెస్తారని పేర్కొన్నారు.

    ఓట్లు పోతాయని బెదిరించారు

    ఓట్లు పోతాయని బెదిరించారు

    మన బలం ప్రజాబలమని, వైసిపి అవినీతి బలం ఆటలు సాగనివ్వమని చంద్రబాబు చెప్పారు. పరిష్కార వేదికగా 1100ను మీ ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. ఎవరైనా లంచం అడిగినా, పనులు చేయకపోయినా, బెల్టుషాపులు కనిపించినా వెంటనే ఒక్క ఫోన్‌ కొట్టండన్నారు. నంద్యాలలో రహదారుల విస్తరణ చేస్తే ఓట్లు పోతాయని కొందరు బెదిరించారని, 95 శాతం మంది ఆమోదం తెలిపారన్నారు.

    కంటతడి పెట్టిన మహిళ

    కంటతడి పెట్టిన మహిళ

    ఎస్సార్బీసీ కాలనీలో డ్వాక్రా సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమైనప్పుడు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆయనతో పొదుపు మహిళ హుసేన్‌బీ మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.

    చంద్రబాబు పాలన రామరాజ్యమని హుసేన్ బీ అన్నారు. పసుపు కుంకుమ కింద రూ.10 వేలు, చంద్రన్న బీమా, ఆసుపత్రిలో చంద్రన్న కిట్లు, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారని, గతంలో ఎప్పుడూ నీళ్ల ఇబ్బంది ఉండేది, ప్రస్తుతం నీటికి ఇబ్బంది లేదని చెప్పారు. 13 వేల మంది పేదలకు ఇళ్లు కట్టిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు మాట్లాడుతూ.. నెలకు ఎంత రెంట్ కడుతున్నావని అడగ్గా.. నాలుగున్నర వేల రూపాయలు అని చెప్పింది. దానికి చంద్రబాబు మాట్లాడుతూ.. పేదలకు ఇళ్లు కావాలనే కట్టిస్తున్నామని చెప్పారు.

    నలభై ఏళ్ల కల

    నలభై ఏళ్ల కల

    నలభై ఏళ్ల రహదారి విస్తరణ హామీని నెరవేర్చుతున్నామని చంద్రబాబు చెప్పారు. నిధులు మంజూరు చేశామన్నారు. రహదారుల విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితులు సుమారు 404 మంది స్వచ్ఛందంగా సహకరించారన్నారు. పూర్తిగా, పాక్షికంగా దెబ్బతింటున్న ఇళ్లకు మార్కెట్‌ ధర కంటే రెండు మూడు రెట్లు అధికంగా నగదు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు.

    పరిహారం సొమ్ముతోపాటు ఎకరా స్థలంలో నిర్మించే దుకాణ సముదాయంలో గుడ్‌విల్‌ లేకుండా నామమాత్రపు అద్దెతో ఇస్తామని చంద్రబాబు చెప్పారు. నాలుగు వేల ఆటో డ్రైవర్లున్న నంద్యాలలో 7వ తరగతి పరీక్ష రాసి అనుత్తీర్ణులైన వారికీ లైసెన్సులు ఇచ్చేలా చూస్తామన్నారు. ఆటోనగర్‌ తన హయాంలోనే ఏర్పాటు చేయించామన్నారు. ఆటోనగర్‌లో ఉన్న చాలామంది పేదవాళ్లకు వంద చదరపు గజాల్లో ఉన్న ప్రతివారికి క్రమబద్ధీకరిస్తానన్నారు.

    ఓ పద్ధతి ప్రకారం న్యాయం

    ఓ పద్ధతి ప్రకారం న్యాయం

    మిగిలిన వారికి ఒక పద్ధతి ప్రకారం న్యాయం చేస్తానని చంద్రబాబు చెప్పారు. రూ.33 కోట్లతో మైనార్టీ బాలికలకు గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. చామ కాలువ ఆధునీకరణ తర్వాత వృథా నీటిని రీసైక్లింగ్‌ చేసేందుకు రూ.90 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే అన్న క్యాంటిన్‌, రైతుబజార్లు ఏర్పాటు చేస్తామన్నారు. బలిజలకు కమ్యూనిటీ భవనానికి మంజూరు చేసిన రూ.3 కోట్లు చాలకపోతే మరింత డబ్బు ఇస్తామన్నారు.

    ఇంకా ఎన్నో..

    ఇంకా ఎన్నో..

    పసుపు కుంకుమ పథకానికి రూ.500 కోట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ప్రతి మహిళకు రూ.10 వేలు ఇస్తున్నామన్నారు. ప్రతి కుటుంబానికి రూ.10వేలు ఆదాయం వచ్చేలా కృషి చేస్తామన్నారు. నీటిపారుదల శాఖకు చెందిన 50 ఎకరాల భూమిని పేదల ఇళ్ల కోసం కేటాయించామన్నారు. కుందూ నదిపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. అపెరల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+