ఉయ్యాలే ఉరితాడై చిన్నారి మృతి: ప్రమాదంలో ఇద్దరు
హైదరాబాద్: నెల్లూరు జిల్లా సంగం మండలం కొత్తూరు కాలనీలో గుండెలు తరుక్కుపోయే సంఘటన చోటు చేసుకుంది. ఉయ్యాలలో నిద్రిస్తున్న చిన్నారికి ఆ ఉయ్యాల తాడే ఉరితాడుగా మారింది. అంజలి అనే చిన్నారి ఉయ్యాలలో నిద్రిస్తుండగా దాని తాడు మెడకు చుట్టుకుని మరణించింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు గుండెలు పిండి చేసేలా విలపించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదనపల్లి వద్ద ఓ కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. సోమవారం అర్థరాత్రి షాద్‌నగర్ నుంచి నగరానికి వస్తుండగా మదనపల్లి వద్ద కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జీడిమెట్ల షాపూర్‌నగర్‌కు చెందిన చిన్నప్ప, డ్రైవర్ రాము మరణించారు.

గండిచెరువు వద్ద డ్రగ్స్ నిల్వ చేసిన గోదామును సీజ్ చేసినట్లు హైదరాబాద్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలిపింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ మార్కెట్ విలువను అంచనా వేయాల్సి ఉందని చెప్పారు.
ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
చిత్తూరులో పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్ టిజి సురేష్ అలియాస్ బుల్లెట్ సురేష్, బెంగళూర్ నగరం కల్లిహల్లికి చెదిన ఆసిఫ్ అలీఖాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు ఎర్రచందనం దుంగలు, ఒక మారుతి 800 కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బుల్లెట్ సురేష్‌పై దాదాపు 12 రకాల కేసులున్నాయి.












Click it and Unblock the Notifications