మరో చిన్నారిని మింగిన బోరుబావి..కొనసాగుతున్న అధికారుల నిర్లక్ష్యం
విడమలూరు : పైప్‌లైన్ కోసం తవ్విన కందకం చిన్నారి ఊపిరి తీసింది. మరో చిన్నారి అస్వస్థతకు గురయ్యాడు. నెల్లూరు జిల్లా విడమలూరు కందకంలో పడి సుష్మిత విగతజీవిగా మారడంతో ఆ కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారి రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ముద్దు ముద్దు మాటలు చెప్పే చిన్నారి చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
12 అడుగుల లోతు ..
నెల్లూరు జిల్లా విడమలూరు మండలం ఊటుకూరు పెదపాలెంలో పైప్ లైన్ కోసం 12 అడుగుల కందకం తవ్వారు. అయితే పైప్ లైన్ వేయకపోవడం .. అటుగా చిన్నారులు వెళతారనే జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. దీంతో అనుకున్నట్టుగానే మూడేళ్ల సుష్మిత, నాలుగేళ్ల గోపీరాజు పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు అధికారులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో కందకానికి సమాంతరంగా తవ్వి మట్టిని వెలికితీశారు.

గంటన్నర నరకయాతన ...
దాదాపు గంటన్నర పాటు చిన్నారులు కందకంలో ఉండిపోయారు. ఈ లోపు జేసీబీతో తవ్వించి .. వారిని బయటకు తీశారు. అయితే కందకంలో పడి చిన్నారి సుస్మిత తీవ్రంగా గాయపడింది. బయటకు తీసిన కాసేపటికే చనిపోయి .. కన్నవారికి కడుపుశోకాన్ని మిగిల్చింది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరూ సురక్షితంగా వచ్చారనే సంతోషం కాసేపట్లో ఆవిరైంది. సుష్మిత మృతితో ఆమె పేరెంట్స్, బంధువులు బోరున విలపించారు.












Click it and Unblock the Notifications