గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దాచేపల్లిలో ఉద్రిక్తత: హోంమంత్రి కాన్వాయ్‌ అడ్డగింత, ‘సుబ్బయ్య’ అప్పగింతకు డిమాండ్

|
Google Oneindia TeluguNews

గుంటూరు: దాచేపల్లిలో శుక్రవారం మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అటుగా వచ్చిన హోంమంత్రి చిన్నరాజప్ప కాన్వాయ్‌ను బాధితురాలి బంధువులు, దాచేపల్లి వాసులు అడ్డుకున్నారు.

దాచేపల్లి రేప్ ఇష్యూ: చెట్టుకు ఉరేసుకున్న నిందితుడు సుబ్బయ్యదాచేపల్లి రేప్ ఇష్యూ: చెట్టుకు ఉరేసుకున్న నిందితుడు సుబ్బయ్య

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆత్మహత్యకు ఒడిగట్టిన సుబ్బయ్య మృతదేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అక్కడివారిని చెదరగొట్టి హోంమంత్రి కాన్వాయ్‌ను అక్కడ్నుంచి పంపించివేశారు. ఈ సందర్భంగా కాన్వాయ్‌ను అడ్డుకున్న పలువురిని అదుపులోకి తీసుకుని తర్వాత వదిలేశారు.

chinna rajappa convoy stopped by Dachepalli villagers

కాగా, గురజాల ప్రభుత్వాసుపత్రిలో సుబ్బయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అతని మృతదేహాన్ని తీసుకునేందుకు బంధువులెవరూ కూడా ముందుకు రాలేదు. దీంతో గురజాల పంచాయతీ సిబ్బందికి సుబ్బయ్య మృతదేహాన్ని అప్పగించనున్నారు.

English summary
Andhra Pradesh Home Minister Chinna Rajappa convoy stopped by Dachepalli villagers on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X