చిరంజీవి, ప్రభాస్ కు కేంద్ర పెద్దల ఆహ్వానం - స్పెషల్ సర్ప్రైజ్...!!

తెలుగు సినీ ప్రముఖ హీరోలు చిరంజీవి, ప్రభాస్ ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. ఈ నెల 22న అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. టాలీవుడ్ నుంచి ఈ ఇద్దరిని ఆహ్వానించటం ఆసక్తి కరంగా మారుతోంది.

ప్రముఖులకు ఆహ్వానాలు: జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం ప్రారంభం కాబోతోంది. ఆ రోజున శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేంద్రలోని బీజేపీ నాయకత్వా ఈ కర్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

Chiranjeevi and Prabhas have been invited for the Historical Inauguration of Ayodhyas Ram Mandir

ఎన్నికల ముందు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కోసం దేశ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను డిసైడ్ చేసింది. ఇందు కోసం ఈ ప్రారంభోత్సవానికి పలు రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించింది. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన రెండు వేల మందికి ఆలయ ట్రస్టు బోర్డు అధికారికంగా ఆహ్వానాలు పంపింది.

చిరంజీవి, ప్రభాస్ కు ఆహ్వానం: టాలీవుడ్ లో చిరంజీవికి ప్రత్యేక స్థానం. ప్రభాస్‌ ఫ్యామిలీ మొదట్నుంచి బీజేపీ పార్టీలోనే ఉంది. అదిపురుష్ సినిమా చేసిన ప్రభాస్ కు రాముడి ఆలయం ప్రారంభోత్సవ వేళ ఆహ్వానించాలని నిర్ణయించారు. టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, నితిన్, నిఖిల్ తోనూ బీజేపీ నేతలు సన్నిహితంగా ఉంటున్నారు.

అదే విధంగా రాజకీయంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. వీరి ఆహ్వానం విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. తమిళం నుంచి సూపర్‌ స్టార్‌ రజనీ, ధనుష్‌లకు ఆహ్వానం అందింది. కన్నడ నుంచి కేజీఎఫ్‌ స్టార్‌ యష్‌, కాంతార ఫేమ్‌ రిషబ్‌ శెట్టిలకు ఆహ్వానం అందిందట. మరోవైపు మలయాళం నంచి మోహన్‌లాల్‌ను ఆహ్వానించారు.

Chiranjeevi and Prabhas have been invited for the Historical Inauguration of Ayodhyas Ram Mandir

దేశ వ్యాప్తంగా పండుగలా: బాలీవుడ్‌ నుంచి పలువురు ప్రముఖులకు ఈ ఆహ్వానాలు అందాయని తెలుస్తోంది. బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌ కుమార్‌, రణ్‌ బీర్‌ కపూర్‌, టైగర్‌ ష్రాఫ్‌, అజయ్ దేవగన్‌లకు ఆహ్వానాలు అందాయని సమాచారం. వీరితోపాటు మాధురీ దీక్షిత్‌, అనుపమ ఖేర్‌, రాజ్‌ కుమార్‌ హిరానీ, సంజయ్‌ లీలా భన్సాలీ, రోహిత్‌ శెట్టి వంటి వారికి ఆహ్వానాలు పంపారు.

దీంతో..టాలీవుడ్ నుంచి ప్రస్తుతం చిరంజీవి, ప్రభాస్ కు ఆహ్వానాలు పంపినట్లు ఆహ్వాన కమిటీ వెల్లడించింది. ఇంకా సమయం ఉండటంతో ఎవరెవరికి ఈ ఆహ్వాలు అందుతాయనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+