అనురాధ టార్గెట్ కాదా?: కవచంగా.. భర్తను కాపాడబోయిన మేయర్
చిత్తూరు: ఏపీలోని చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల దారుణ హత్య నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. చిత్తూరు, కర్నూలు ప్రజాప్రతినిధుల పరిసర ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు.
మున్సిపల్ కార్యాలయానికి అనురాధ మృతదేహం
చిత్తూరు నగర మున్సిపల్ కార్యాలయానికి మృతి చెందిన మేయర్ అనురాధ మృతదేహాన్ని తరలించారు. ప్రజల సందర్శనార్థం కార్యాలయంలో ఉంచనున్నారు. అనురాధ మృతదేహాన్ని చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు, ప్రజలు తరలి వచ్చారు.

భర్తను కాపాడేందుకు మేయర్ అనురాధ ప్రయత్నం
చిత్తూరు నగర మేయర్ అనురాధ, భర్త మోహన్ మంగళవారం ఉదయం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వీరి హత్యకు మార్కెట్ యార్డు గొడవ కారణమని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, మేయర్ అనురాధ తన భర్త మోహన్‌ను కాపాడబోయి కాల్పుల బారిన పడిందంటున్నారు.
అనురాధ దంపతుల పైన దాడి జరిగిన సమయంలో ముగ్గురు కార్పోరేటర్లు కూడా అక్కడే ఉన్నారు. కాల్పులకు తెగబడిన వారు తొలుత.. భర్త మోహన్ పైన దాడి చేయబోగా, ఆమె భర్తను కాపాడబోయే క్రమంలో బుల్లెట్లు దిగి ఉండవచ్చునని అంటున్నారు. అసలు ఆమె టార్గెట్ కాకపోవచ్చుననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
అనురాధ శరీరంలోకి రెండు బుల్లెట్లు దిగాయి. ఒక బుల్లెట్ ఎడమ కన్ను వద్ద, మరొకటి నుదుటిలోకి దిగింది. అనురాధ అడ్డుపడ్డాక.. ముసుగులో వచ్చిన వారు మోహన్ పైన కత్తులతో దాడి చేసి ఉంటారంటున్నారు. ఈ రోజు అనురాధ అంత్యక్రియలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications