వైఎస్ జగన్‌ నా శ్రేయోభిలాషి: సీఎంతో భేటీపై నాగార్జున ఇంకా ఏమన్నారంటే..?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ సినీనటుడు నాగార్జున గురువారం కలిశారు. అనంతరం విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్‌కి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు నాగార్జున.

జగన్‌ను చూసి చాలా రోజలవుతోంది: నాగార్జున

జగన్‌ను చూసి చాలా రోజలవుతోంది: నాగార్జున

'విజయవాడకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సీఎం జగన్ నా శ్రేయోభిలాషి. జగన్మోహన్ రెడ్డిని చూసి చాలా రోజులవుతుంది. అందువల్ల విజయవాడ వచ్చాను. జగన్‌తో కలిసి లంచ్ చేశాను. ఇది నా వ్యక్తిగత పర్యటన. ఇండస్ట్రీ గురించి ఎలాంటి చర్చ జరగలేదు' అని నాగార్జున తెలిపారు. అనంతరం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరారు సినీనటుడు అక్కినేని నాగార్జున. నాగార్జునతో సీఎం వైఎస్ జగన్ ఈ సమావేశంలో నాగార్జున తన వ్యక్తిగత విషయాలు మాత్రమే మాట్లాడారని స్పష్టం చేశాయి.

ఊహాగానాలను కొట్టేసిన నాగార్జున

ఊహాగానాలను కొట్టేసిన నాగార్జున


ఏపీలో సినిమా రంగం, థియేటర్లలో సమస్యలు, ఆన్‌లైన్ టికెటింగ్, ఆక్యుపెన్సీకి సంబంధించిన అనేక అంశాలు హాట్‌టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. నాగార్జున టాలీవుడ్ సమస్యల్ని సీఎంతో చర్చించి వుంటారని ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో వాటిని కొట్టిపారేశారు నాగార్జున. కేవలం వ్యక్తిగత సంబంధాల కోసమే నాగార్జున-జగన్ ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆన్‌లైన్ టికెటింగ్ పై కొనసాగుతున్న ఆందోళన

ఆన్‌లైన్ టికెటింగ్ పై కొనసాగుతున్న ఆందోళన

కాగా, సినిమా ప్రదర్శనల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం నిర్మాతలకు నష్టం కలిగించేది ఉందనే అభిప్రాయం సినీ పరిశ్రమలో వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఆన్‌లైన్ టికెట్ల విక్రయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో టికెట్ల రూపంలో వచ్చిన డబ్బును నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు వీలైనంత త్వరగా ప్రభుత్వం ఇవ్వకపోతే వారు నష్టపోయే ప్రమాదం ఉందని సినీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రభుత్వ ఆన్‌లైన్ టికెట్ల విక్రయానికి వ్యతిరేకించారు.

Recommended Video

    Bigg Boss Telugu 5 : Siri ఫ్యూచర్ Shannu చేతిలో.. పాపం Lobo || Oneindia Telugu
    సీఎంతో నాగార్జున ఏం చర్చించారు?

    సీఎంతో నాగార్జున ఏం చర్చించారు?

    ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్‌తో నాగార్జున భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు తదితర అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై స్పష్టత రాలేదు. కానీ, నాగార్జున మాత్రం ఎలాంటి ఇతర అంశాలపై చర్చించలేదని, వ్యక్తిగతంగానే సీఎంను కలిసినట్లు మీడియాకు స్పష్టం చేశారు. నాగార్జున వెంట నిర్మాతలు ప్రీతం రెడ్డి, నిరంజన్ రెడ్డి ఉన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+