వీడియో: టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాల్లో తన్నులాట: మేం జెండాలు మోస్తే మీరు అనుభవించారు
కాకినాడ: తెలుగుదేశం పార్టీ- జనసేన నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీల ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాలు రసాభాసగా మారుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయి కార్యకర్తల మధ్య నెలకొన్న విభేదాలు ఒక్కసారిగా పెల్లుబుకుతున్నాయి. పరస్పర ఆరోపణలు, విమర్శలకు దిగుతున్నారు. దుమ్మెత్తి పోసుకుంటోన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఈ రెండు పార్టీల మధ్య నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. 16వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అనంతరం 17వ తేదీ నుంచి ఈ రెండు పార్టీల నాయకులు కూడా నియోజకవర్గ స్థాయిలో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నాయి.

ఇదివరకే ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై టీడీపీ-జనసేన కమిటీ చర్చించింది. వాటిని ఆమోదిస్తూ రాజమండ్రి సమావేశంలో ఓ తీర్మానాన్నిఆమోదించింది. ఇందులో మొత్తంగా 11 అంశాలను చేర్చారు. వాటికి ఈ రెండు పార్టీల అగ్ర నాయకత్వం నుంచి అంగీకారం లభించింది. నియోజకవర్గ స్థాయి నాయకుల్లో మాత్రం అనేక అంశాలపై విభేదాలు నెలకొన్నాయి.
టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాల్లో తన్నులాట..!!#JANASENA #TDP #TDPJSPAlliance #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/goFgtPnwJk
— oneindiatelugu (@oneindiatelugu) November 15, 2023
టీడీపీ- జనసేన మధ్య పలు అంశాలపై విభేదాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేకించి- తెలుగుదేశం పార్టీ ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడం పట్ల జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు. గ్రామాల్లో తాము ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తోంటే తెలుగుదేశం నాయకులు లబ్ది పొందుతున్నారనే అసహనం వారిలో నెలకొంది.

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ- జనసేన మధ్య ఏర్పాటైన ఆత్మీయ సమావేశాల్లో ఇది బహిర్గతమైంది. టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన ఇన్‌ఛార్జీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలంటూ ఎస్వీఎస్ఎన్ వర్మ చేసిన సూచనల పట్ల జనసేన నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీతో ఘర్షణకు దిగారు. పెద్ద ఎత్తున వాగ్వివాదం చేశారు. ఒక దశలో స్టీల్ బెంచీలను ఎత్తి కిందికి పడేశారు. ఇన్నాళ్లు తాము జెండాలను మోశామని, పార్టీ కోసం కష్టపడితే టీడీపీ నాయకులు అనుభవించారంటూ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications