మెసేజ్ పంపాడని: ప్రాణంతీసిన ఫేస్‌బుక్ గొడవ(పిక్చర్స్)

హైదరాబాద్: ఫేస్ బుక్ సందేశం, గొడవ ఓ బాలుడి ప్రాణం తీసింది. ఫేస్ బుక్‌లో సందేశం పెట్టాడనే కోపంతో పదో తరగతి విద్యార్థి తన స్నేహితులతో వచ్చి తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులపై దాడి చేయగా.. ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం... హస్తినాపురం షిరిడిసాయినగర్‌కు చెందిన దుర్గయ్య తనయుడు ప్రవీణ్ యాదవ్ స్థానికంగా ఉన్న నాగార్జున హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న హస్తినాపురంలోని లక్ష్మనర్సింహ కాలనీకి చెందిన ఇద్దరు... ప్రవీణ్ యాదవ్ స్నేహితులు.

బిఎన్ రెడ్డి నగర్‌కు చెందిన మరోవ్యక్తి ఓ స్కూలులో పదో తరగతి చదువుతున్నాడు. ప్రవీణ్‌కు కొద్ది రోజుల క్రితం ఫేస్ బుక్‌లో ఆ స్కూలు విద్యార్థితో పరిచయం అయింది. వారిద్దరు నిత్యం ఫేస్ బుక్‌లో సందేశాలు పోస్ట్ చేసుకునేవారు. అయితే, ప్రవీణ్ సహవిద్యార్థిని విషయంలో వారి మధ్య గొడవ ప్రారంభమైంది. కొద్దిరోజులుగా వారు అసభ్య సందేశాలు పోస్ట్ చేసుకుంటున్నారు.

ఫేస్‌బుక్

ఫేస్‌బుక్

పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు కారణమైన వారు దొరికితే మిగిలిన విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

ఫేస్‌బుక్

ఫేస్‌బుక్

ప్రవీణ్ యాదవ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అథడి కణత పైన దెబ్బ తగలడంతో ప్రవీణ్ మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఫేస్‌బుక్

ఫేస్‌బుక్

ఇది చినికి చినికి వానలా అయింది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ శనివారం రోడ్డుపై వెళ్తుండగా... అయిదుగురు వచ్చి అతనిని చితకబాదారు.

ఫేస్‌బుక్

ఫేస్‌బుక్

ప్రవీణ్ అక్కడే కిందపడిపోయాడు. అది చూసిన వారు పారిపోయారు. స్థానికులు ప్రవీణ్‌ను ఆసుపత్రికి తరలించగా... మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+