5 రోజులు బెజవాడ నుండి: దేవినేని, సీఎం ఆఫీస్‌పై

అమరావతి: బెజవాడలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ప్రారంభం వాయిదా పడింది. ఈ నెల 8వ తేదీన సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రారంభమవుతుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శనివారం చెప్పారు. ఇక నుండి వారంలో 5 రోజుల పాటు విజయవాడ నుండి పాలన ఉంటుందన్నారు.

నవ్యాంధ్రలో తన కార్యకలాపాల కోసం విజయవాడలో తీర్చిదిద్దిన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ప్రారంభించేందుకు తొలుత సిద్ధమయ్యారు. అయితే, అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది.

CM camp office opened on 8th June

రాజధాని నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం ఆయన తన క్యాంపు కార్యాయాన్ని ప్రారంభించవలసి ఉండె. కానీ ఆశించిన స్థాయిలో పనులు సాగలేదు. దీంతో వాయిదా పడిందని తెలుస్తోంది.

సీఎం చాంబర్‌తోపాటు ఆయన పేషీ , డైనింగ్‌ హాల్‌, మీటింగ్‌ హాల్‌, విజిటర్స్‌ వెయిటింగ్‌ రూమ్‌, చీఫ్‌ సెక్రటరీ చాంబర్‌, ముఖ్య కమిషనర్లు, అధికారుల చాంబర్లు కూడా పూర్తికావాల్సి ఉంది. వీటి పనులు నెలాఖరుకుగానీ పూర్తయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+