ఆ బాధ్యత మాదే, పార్టీలో ఇక నుంచి - చంద్రబాబు కీలక ప్రకటన..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైందని.. ఇక షిప్మెంటే మిగిలిందని వెల్లడించారు. అనుకున్న సమయానికి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చేలా అడ్డంకులు అధిగమిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. విశాఖలో ఈ నెల 14, 15వ తేదీల్లో జరిగే పెట్టుబడుల సదస్సు ఈ సారి నిర్మాణాత్మకంగా జరగనుందని తెలిపారు. పార్టీ పరంగా వచ్చే నెల నుంచి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని వెల్లడించారు.
విశాఖ లో జరిగే పెట్టుబడుల సదస్సులో ప్రెజెంటేషన్, ఎగ్జిక్యూషన్, ఎగ్జిబిషన్, ఒప్పందాలు ఇలా వివిధ రూపాల్లో 2 రోజుల సదస్సు సాగనుందని చంద్రబాబు చెప్పారు. అత్యాధునిక సాంకేతిక అంశాలపై అధ్యయనం కూడా ఉంటుందన్నారు. ప్రతి వ్యక్తి అకౌంటబిలిటీ పరిధిలోకి వచ్చి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వీఆర్వోల వరకూ బాధ్యతగా పనిచేసేలా చర్యలు తీసుకుం టామని స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వచ్చే ప్రముఖులు, పెట్టుబడిదారులకు విశాఖ సదస్సు కొత్త అనుభూతిని ఇస్తుందని అన్నారు. క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైందని, ఇక షిప్మెంటే మిగిలింద ని వెల్లడించారు. అనుకున్న సమయానికి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చేలా అడ్డంకు లు అధిగమిస్తున్నామని తెలిపారు.

కిందిస్థాయిలో ఉన్న అవినీతి నిర్మూలనకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ముందు పెండింగ్ ఉన్న రెవెన్యూ సమస్యలు పరిష్కరించాల్సి ఉందని, దీనిపై ఇప్పటికే అధికా రులకు ఆదేశాలిచ్చామన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల రెవెన్యూ అంశాలు సంక్లిష్టం గా మారాయని మండిపడ్డారు. సమస్య ఎందుకు పరిష్కారం కావట్లేదో బాధితుడికి స్పష్టంగా అర్థమయ్యేలా తెలిపే విధానం తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పరిష్కారం కాని సమస్యలకు ఉన్న సాంకేతిక అడ్డంకులపై వివరంగా బాధితుడికి తెలియాలన్నారు. సున్నితమైన అంశాలను జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉందని, 22ఏ నిషేధిత జాబితా భూములపైనా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు విధిగా ప్రజా దర్బార్ లు నిర్వహించా ల్సిందేనని తేల్చిచెప్పారు. ప్రజా సమస్యలు పట్టించుకోం అంటే కుదరదని స్పష్టం చేసారు.
అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని, హైదరాబాద్ స్థాయిలో ఇక్కడా భారీ ఈవెంట్లు జరుగుతు న్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో భారీ ఈవెంట్ల ను ప్రోత్సహిస్తోందన్నారు. పార్టీ కమిటీలు వీలైనన్ని నెలాఖరులోగా పూర్తి చేస్తామని, పార్లమెంట్ కమిటీల మీద కసరత్తు ముమ్మరంగా సాగుతోందని వివరించారు. డిసెంబర్ చివరి నాటికి అన్ని కమిటీలు పూర్తి చేసి పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తామని చంద్రబాబు వెల్లడించారు.












Click it and Unblock the Notifications